విజయ్ సభలో తొక్కిసలాట ఘటన... అసలు కారణం అదే అంటున్న ప్రత్యక్ష సాక్షులు!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-09-28 03:06:07  IST  )

త‌మిళ‌నాడు స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజ‌య్ నిర్వ‌హించిన క‌రూర్ స‌భ‌లో జరిగిన తొక్కిసలాట ఘ‌ట‌న‌లో 39మంది మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు.

విజయ్ సభలో తొక్కిసలాట ఘటన... అసలు కారణం అదే అంటున్న ప్రత్యక్ష సాక్షులు!
X

దిశ‌, వెబ్ డెస్క్: త‌మిళ‌నాడు స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజ‌య్ నిర్వ‌హించిన క‌రూర్ స‌భ‌లో జరిగిన తొక్కిసలాట ఘ‌ట‌న‌లో 39మంది మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. మ‌రికొందరి ప‌రిస్థితి కూడా విష‌మంగా ఉంది. అయితే ఈ ఘ‌ట‌న‌కు నిర్వాహ‌కుల నిర్ల‌క్ష్య‌మే కార‌ణం అని ఆరోప‌ణ‌లు వ‌స్తుండ‌గా, క‌రెంట్ పోవ‌డం కూడా ఓ కార‌ణం అని ప్ర‌త్య‌క్ష సాక్షులు చెబుతున్నారు. విజ‌య్ ప్ర‌చార వాహ‌నం వ‌ద్ద‌కు చేరుగానే విద్యుత్ స‌ర‌ఫరా నిలిచిపోయిందని దానివ‌ల్ల‌నే తొక్కిస‌లాట జ‌రిగింద‌ని అంటున్నారు.

క‌రెంట్ పోయిన త‌ర‌వాత అభిమాన న‌టుడిని ద‌గ్గ‌ర నుండి చూడాల‌నే ఆత్రుత‌లో ఘ‌ట‌న జ‌రిగింద‌ని ప‌లువురు చెబుతున్నారు. మ‌రోవైపు భారీగా వ‌చ్చిన అభిమానుల‌ను క‌ట్టడి చేయ‌డానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేశార‌ని అందువ‌ల్ల‌నే తొక్కిసలాట జ‌రిగింద‌ని మ‌రికొంద‌రు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే సీఎం స్టాలిన్ క‌లెక్ట‌ర్ తో మాట్లాడారు. ఇక ఈ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై మ‌ద్రాస్ హైకోర్టు మాజీ న్యాయ‌మూర్తి అరుణ జ‌గ‌దీషణ్ తో ఏక‌స‌భ్య‌ క‌మిటీ వేశారు.

Read More: తమిళనాడు తొక్కిసలాట ఘటనపై స్పందించిన డీజీపీ

Next Story