70వేల బూత్ కమిటీ కార్యదర్శులను నియమించనున్న విజయ్ పార్టీ

by Ajay Maddhiboyina |   (  Updated:2025-02-13 15:25:33  IST  )

2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ 68,320 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసింది. ఈ బూత్‌లన్నింటికీ కార్యదర్శులను నియమించాలని విజయ్ నిర్ణయం తీసుకున్నారు.

70వేల బూత్ కమిటీ కార్యదర్శులను నియమించనున్న విజయ్ పార్టీ
X

- నియామకానికి గ్రీన్ సిగ్నల్

దిశ, నేషనల్ బ్యూరో: తమిళ సూపర్ స్టార్ విజయ్ కొత్తగా స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. టీవీకే కోసం తమళనాడు వ్యాప్తంగా 70 వేల మంది ఫుల్ టైం బూత్ కమిటీ కార్యదర్శులను నియమించడానికి కసరత్తు చేస్తున్నట్లు విజయ్ తెలిపారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే కాకుండా, క్షేత్ర స్థాయిలో ప్రాతినిథ్యం ఉండాలనే లక్ష్యంగా ఈ నియామకాలు చేపడుతున్నట్లు విజయ్ చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ 68,320 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసింది. ఈ బూత్‌లన్నింటికీ కార్యదర్శులను నియమించాలని విజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అన్ని జిల్లా కార్యదర్శులకు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ఫిబ్రవరి నెలాఖరు లోగా బూత్ కమిటీ కార్యదర్శుల నియామకం పూర్తి చేయాలని చెప్పారు. బూత్ కమిటీ కార్యదర్శుల నియామకం సులభతరంచేయడానికి టీవీకే పార్టీ ఒక ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లింక్‌ను రూపొందించింది. దీని ద్వారా ఆసక్తిగల కార్యకర్తలను రిజిస్టర్ చేయాలని చెప్పింది. ఈ నియామకాలన్నీ పూర్తయిన తర్వాత బూత్ కమిటీ కార్యదర్శులకు విస్తృత స్థాయిలో శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు.

Next Story