- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళనాడు నెక్ట్స్ సీఎం విజయ్.. ఇందులో అనుమానమే లేదు: సెంగోట్టియన్
సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన తమిళ అగ్రకథానాయకుడు దళపతి విజయ్ రాజకీయాలపై ఫుల్ ఫోకస్ చేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన తమిళ అగ్రకథానాయకుడు దళపతి విజయ్(Thalapathy Vijay) రాజకీయాలపై ఫుల్ ఫోకస్ చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీటీవీ దినకరన్, ఓపీఎస్ నేతలతో జతకట్టేందుకు చూస్తున్నారు. ఇప్పటికే పొత్తులపై టీవీకే నేత సెంగోట్టియన్ ప్రకటన చేశారు. ఎన్నికల సర్వేలపై తమకు నమ్మకం లేదని కొట్టిపారేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీవీకే పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం, విజయ్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని జోస్యం చెప్పారు.
ఆసక్తిగా తమిళ రాజకీయాలు
కాగా, తమిళనాడులో 2026 తొలి త్రైమాసికంలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు కొద్ది నెలలే ఉండడంతో రాజకీయ పార్టీలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. ఇప్పటిదాకా తమిళనాడులో డీఎంకే, ఏడీఎంకే పార్టీలే మార్చి.. మార్చి అధికారాన్ని సొంతం చేసుకుంటూ వస్తున్నాయి. ఇటీవల నటుడు విజయ్ సొంత పార్టీని ఏర్పాటు చేసి ఈసారి ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. గత మూడు నెలలుగా శని, ఆదివారాలు ప్రజల్లోకి వెళ్లేందుకు వీకెండ్ టూర్ ఏర్పాటు చేసుకున్న విజయ్ ఆ దిశగా వరుస సభలు నిర్వహించారు. అయితే ఇప్పుడు సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి పూర్తి సమయం రాజకీయాలకు కేటాయిస్తుండటంతో తమిళ రాజకీయాలు ఆసక్తిగా మారాయి.






