- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్ఈపీ అమలు చేస్తే 2000 ఏళ్లు వెనక్కి..
కేంద్ర ప్రభుత్వం తమిళ భాష, సంస్కృతిని మాత్రమే ప్రోత్సహిస్తున్నట్లు చెప్పుకుంటూ సంస్కృతాన్ని అధికంగా ప్రోత్సహిస్తుందని స్టాలిన్ ఆరోపించారు.

- కేంద్రం రూ.10 వేల కోట్లిచ్చినా అమలు చేయం
- కొత్త విద్యా పాలసీని అంగీకరించబోం
- తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్
దిశ, నేషనల్ బ్యూరో: నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) -2020 అమలుపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య వివాదం మరింత తీవ్రంగా మారుతోంది. ఎన్‌ఈపీ 2020ని అమలు చేయడం వల్ల తమిళనాడు 2000 ఏళ్లు వెనక్కి వెళ్తుంది. తమిళనాడును తిరోగమనం దిశంగా తీసుకెళ్లడం మహా పాపం. కేంద్రం రూ.10 వేల కోట్లు ఇస్తామని చెప్పినా తమిళనాడు ప్రభుత్వం ఎన్‌ఈపీకి అంగీకరించదని శనివారం ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. నూతన విద్యా విధానం ద్వారా రాష్ట్రంలో త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సూచించడం పట్ల స్టాలిన్ స్పందించారు. రాష్ట్రానికి హాని కలిగించే, తమిళ గుర్తింపుకు వ్యతిరేకంగా ఉండే ఏ విధానాన్ని కూడా తాను అంగీకరించనని ఎంకే స్టాలిన్ పునరుద్ఘాటించారు. కడలూరులో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ ఎనిమిది కోట్ల మంది మాట్లాడే తమిళ భాషాభివృద్ధికి కేంద్ర రూ.74 కోట్ల మాత్రమే కేటాయించింది. అదే సమయంలో కొన్ని వేల మంది మాత్రమే మాట్లాడే సంస్కృతం కోసం మాత్రం రూ.1,488 కోట్ల కేటాయించిందని దుయ్యబట్టారు.
కేంద్ర ప్రభుత్వం తమిళ భాష, సంస్కృతిని మాత్రమే ప్రోత్సహిస్తున్నట్లు చెప్పుకుంటూ సంస్కృతాన్ని అధికంగా ప్రోత్సహిస్తుందని స్టాలిన్ ఆరోపించారు. తమిళనాడులో నూతన విద్యా విధానాన్ని అమలు చేయడంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలు ఉన్నాయి. దీన్ని సాకుగా చూపిస్తూ కీలక పథకాలకు కేంద్రం నిధులను నిలిపి వేసిందని కేంద్ర విద్యా శాఖపై స్టాలిన్ మండిపడ్డారు. తమిళనాడు కేవలం ద్విభాషా విధానాన్ని మాత్రమే అనుసరిస్తుంది. రాష్ట్రంలో తమిళం, ఇంగ్లీష్ మాత్రమే బోధిస్తామని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా స్పష్టం చేశారు. కాగా, విద్యా విధానంలో సంస్కరణలను కూడా తమిళనాడు సీఎం స్టాలిన్ రాజకీయంగా తప్పుడు కథనాల కోసం వాడుకుంటున్నారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర్ ప్రధాన్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఎన్‌ఈసీ అమలుపై స్టాలిన్‌కు లేఖ రాశారు. దీనిపైనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది.






