Tamil Nadu: జాతీయ విద్యావిధానంపై సుప్రీంకోర్టుని ఆశ్రయించిన తమిళనాడు

by Shamantha N |

జాతీయవిద్యావిధానంపై గతకొంతకాలంగా కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అంశంలో స్టాలిన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది.

Tamil Nadu: జాతీయ విద్యావిధానంపై సుప్రీంకోర్టుని ఆశ్రయించిన తమిళనాడు
X

దిశ, నేషనల్ బ్యూరో: జాతీయవిద్యావిధానంపై గతకొంతకాలంగా కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అంశంలో స్టాలిన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది. జాతీయ విద్యా విధానం అమలు చేయడం లేదన్న కారణంతో మోడీ ప్రభుత్వం తమ రాష్ట్రానికి రావాల్సిన రూ.2,151 కోట్ల నిధులను నిలిపివేసిందని కోర్టుకు తెలిపింది. ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేసింది. సమగ్ర శిక్ష పథకం అవసరాలకు అనుగుణంగా తమిళనాడు ఉందని గతేడాది ఫిబ్రవరి 16న జరిగిన ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు (Project Approval Board) సమావేశంలో కేంద్రం సంతృప్తి వ్యక్తం చేసిందని పిటిషన్ లో ప్రస్తావించింది. ఆ తర్వాత ఈ పథకం కింద ఖర్చు కోసం రూ.3,585.99 కోట్ల నిధుల కేటాయింపు జరిగిందని పేర్కొంది. ఇందులో 60:40 నిష్పత్తి ప్రకారం, కేంద్రం వాటా రూ.2,151 కోట్లు అని తెలిపింది. ఈ నిధులు గత ఏడాది ఏప్రిల్ 1 నుంచే రాష్ట్రానికి చెల్లించాల్సి ఉందని తెలిపింది. అయితే, జాతీయ విద్యా విధానం అమలు చేయడం లేదన్న కారణంతో ఆ నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని పిటిషన్‌లో వివరించింది.

త్రిభాషా సూత్రంపై విమర్శలు

ఇకపోతే, కేంద్రం ప్రతిపాదించిన త్రి భాషా సూత్రాన్ని స్టాలిన్‌ (MK Stalin) ప్రభుత్వం ముందు నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ సూత్రం ప్రకారం, విద్యార్థులు ఇంగ్లిష్, ప్రాంతీయ భాషతో పాటు మూడో భాషను కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే, జాతీయ విద్యావిధానం ముసుగులో కేంద్రం తమపై హిందీ భాషను బలవంతంగా రుద్దుతోందని తమిళనాడు ప్రభుత్వం మండిపడుతోంది.

Next Story