ఏప్రిల్ 23న వేతనంతో కూడిన సెలవు.. కమిషనర్ ఉత్తర్వులు

by Naga Rani Yarlagadda |

ఏప్రిల్ 23న కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని తమిళనాడు లేబర్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏప్రిల్ 23న వేతనంతో కూడిన సెలవు.. కమిషనర్ ఉత్తర్వులు
X

దిశ, వెబ్‌డెస్క్: కర్మాగారాలు, దుకాణాల్లో పనిచేస్తోన్న కార్మికులకు ఈనెల 23న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని పేర్కొంటూ.. తమిళనాడు లేబర్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ రోజున రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 100కు 100 శాతం పోలింగ్ జరిగేలా ఎన్నికల కమిషన్ అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలోని కర్మాగారాలు, దుకాణాల్లో పనిచేస్తున్న కార్మికులంతా తమ ఓటుహక్కును వినియోగించుకునేలా ఏప్రిల్ 23న జీతంతో కూడిన సెలవు ఇవ్వాలని లేబర్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అలా సెలవు ఇవ్వని కర్మాగారాలు, దుకాణాలపై కార్మికులు.. జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ - 7904646090, అలాగే అసిస్టెంట్ కమిషనర్లు ఎల్ శోభన - 7299007334, పి. పళని - 7904802429, ఎస్ శివకుమార్ - 9043555123 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణంగా పోలింగ్ రోజున సెలవు ఉంటుంది. అయితే.. ప్రైవేట్ సంస్థలు, కర్మాగారాలు (Factories), చిన్నపాటి దుకాణాల్లో పనిచేసే వారికి కూడా వేతనంతో కూడిన సెలవు (Paid Holiday) లభించేలా చూడటం ఈ ఉత్తర్వుల ప్రత్యేకత.

Next Story