కరోనా టెన్షన్.. రాష్ట్ర సర్కార్ షాకింగ్ నిర్ణయం

by velandi.Saikiran |

ఇండియా వ్యాప్తంగా ( India) మళ్లీ కరోనా కేసులు( Carona Cases) క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు తగ్గి ముఖం

కరోనా టెన్షన్.. రాష్ట్ర సర్కార్ షాకింగ్ నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియా వ్యాప్తంగా ( India) మళ్లీ కరోనా కేసులు( Carona Cases) క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు తగ్గి ముఖం పట్టిన కరోనా కేసులు... ఎండాకాలం ముగుస్తున్న తరుణంలో పెరుగుతున్నాయి. ఇండియా వ్యాప్తంగా కరోనా కేసులతో పాటు మరణాలు కూడా.. క్రమంగా పెరిగిపోతున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో తమిళనాడు ( Tamilnadu) రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా కేసుల నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది తమిళనాడు ప్రభుత్వం. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.... అందరూ మాస్కులు ( Masks) ధరించాలని కోరింది. జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్కులు ధరించడమే కాకుండా సామాజిక దూరం పాటించాలని ప్రజలకు స్పష్టం చేసింది తమిళనాడు సర్కార్.

అలాగే ఆసుపత్రిలో ఉన్న మందులు, రోగనిర్ధారణ పరికరాలు, వైద్య సౌకర్యాల వివరాలను సేకరించాలని జిల్లా ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది సర్కార్. ఇది ఇలా ఉండగా తమిళనాడు రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో మొత్తం కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో 185 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు ఇండియా వ్యాప్తంగా కూడా... 3395 కు కరోనా కేసులు చేరుకున్నాయి. వీటిలో కేరళ రాష్ట్రంలో ఏకంగా 1336 కేసులు నమోదు కావడం గమనార్హం. ఆ తర్వాత మహారాష్ట్ర 467 కేసులతో రెండో ప్లేస్ లో ఉంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మాత్రం కరోనా కేసులు( Carona Cases) ప్రభావం తక్కువగానే ఉంది.

Next Story