తమిళనాడులో 'దళపతి' శకం మొదలు: గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గవర్నర్.. రేపే విజయ్ ప్రమాణ స్వీకారం

by Gantepaka Srikanth |

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా నటుడు విజయ్ పగ్గాలు చేపట్టబోతున్నారు. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెరదించుతూ, టీవీకే (TVK) పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు రావాల్సిందిగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అధికారికంగా ఆహ్వానం పంపారు.

తమిళనాడులో దళపతి శకం మొదలు: గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గవర్నర్.. రేపే విజయ్ ప్రమాణ స్వీకారం
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా నటుడు విజయ్ పగ్గాలు చేపట్టబోతున్నారు. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెరదించుతూ, టీవీకే (TVK) పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు రావాల్సిందిగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అధికారికంగా ఆహ్వానం పంపారు. దీంతో రేపు (శనివారం) విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే, మెజారిటీకి 10 స్థానాల దూరంలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్ (5), సీపీఐ (2), సీపీఎం (2), వీసీకే (2) పార్టీలు విజయ్‌కు తమ మద్దతును ప్రకటించాయి. దీంతో టీవీకే కూటమి బలం 118 (మేజిక్ ఫిగర్) కు చేరుకుంది. మద్దతు లేఖలను పరిశీలించిన గవర్నర్, విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.

ద్రవిడ కోటలో కొత్త జెండా..

1977 తర్వాత డిఎంకె (DMK), అన్నాడీఎంకే (AIADMK) కాకుండా మూడవ శక్తి తమిళనాడులో అధికారాన్ని కైవసం చేసుకోవడం ఇదే మొదటిసారి. కేవలం రెండేళ్ల క్రితం పార్టీ పెట్టిన విజయ్, మొదటి ప్రయత్నంలోనే అధికార పీఠాన్ని దక్కించుకోవడం భారత రాజకీయాల్లోనే ఒక సంచలనంగా మారింది. రేపు జరగనున్న ప్రమాణ స్వీకార మహోత్సవం కోసం చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం ముస్తాబవుతోంది. ఈ కార్యక్రమానికి పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు, భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. "తమిళనాడు ప్రజల ఆశీస్సులతో కొత్త శకం ప్రారంభం కాబోతోంది. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి సుస్థిరమైన పాలన అందిస్తాం" అని టీవీకే వర్గాలు వెల్లడించాయి.

Next Story