- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాయిలెట్ ఓపెనింగ్‌కు బుల్డోజర్! అమ్మాయిలు నోట్ల దండలు.. డీఎంకే ఎమ్మెల్యే హంగామా!
తమిళనాడులో ఓ ఎమ్మెల్యే చేసిన టాయిలెట్ ఓపెనింగ్ సంచలనం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు (Tamil Nadu)లో ఓ ఎమ్మెల్యే చేసిన టాయిలెట్ ఓపెనింగ్ సంచలనం రేపుతోంది. తాజాగా తమిళనాడులోని తిరువొత్తియూర్ నియోజికవర్గంలో ఒక బస్టాప్‌కు ఎమ్మెల్యే చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. (DMK party MLA KP Shankar) డీఎంకే పార్టీ ఎమ్మెల్యే కేపీ శంకర్ తన నియోజకవర్గంలోనే ఈ బస్టాప్ ఓపెనింగ్ పెద్ద వేడుకల జరిపి హంగామా క్రియేట్ చేశారు. అందులో భాగంగా టాయిలెట్‌ను సైతం రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేశారు. మొదట ఎమ్మెల్యే రాగానే బుల్డోజరుతో పూల వర్షం కురిపించారు. దీంతో ఎమ్మెల్యే పూల వర్షానికి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మరోవైపు 5 నుంచి 7 మంది అమ్మాయిలు రూ. 500 నోట్ల దండలు వరుసగా ఎమ్మెల్యే మెడలో వేసి సత్కరించారు. పూల రేకులతో నిండిన ఎమ్మెల్యే వాటిని తొలగించి బస్టాప్, టాయిలెట్ రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేశారు. వెంటనే కార్యకర్తలు టపాసులు పేల్చి పెద్ద సంబరాలు చేశారు.
ఈ కార్యక్రమానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. బస్ స్టాప్, టాయిలెట్ల నిర్మాణానికి అయిన ఖర్చు కంటే ఎమ్మెల్యే శంకర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికే ఎక్కువ ఖర్చు చేశాడని చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. తమిళనాడు డీఎంకే ఎమ్మెల్యే టాయిలెట్ ప్రారంభోత్సవం అని ఐపీఎల్ ఫౌండర్ లలిత్ కుమార్ మోడీ (Lalit Kumar Modi) ఎక్స్ వేదికగా ఈ వీడియో పంచుకున్నాడు. టాయిలెట్ ఖర్చు కంటే ప్రారంభోత్సవానికి వారు ఎక్కువ డబ్బు ఖర్చు చేశారని పేర్కొన్నారు. ఈ ఖర్చు పెట్టే బదులు ఇంకా ఎన్నో టాయిలెట్స్ నిర్మించవచ్చని, పబ్లిక్ డబ్బులు వృధా చేశారని ఎమ్మెల్యేపై నెటిజన్లు మండిపడ్డారు.






