సీఎం విజయ్ కారు డ్రైవర్ కుమారుడికి కీల‌క ప‌ద‌వి !

by velandi.Saikiran |

సీఎం విజయ్ కారు డ్రైవర్ కుమారుడు శ‌బ‌రినాథ‌న్ కు కీల‌క ప‌ద‌వి ద‌క్కింది.

సీఎం విజయ్ కారు డ్రైవర్ కుమారుడికి కీల‌క ప‌ద‌వి !
X

దిశ‌, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కారు డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్ ను ప్రభుత్వ చీఫ్ విప్ గా నియామకం చేశారు. దీంతో అతనికి కేబినెట్ ర్యాంకు హోదా దక్కనుంది. మంత్రి స్థాయి అధికారాలు, సౌకర్యాలు కూడా ఇక‌పై ఉంటాయి. ఇది ఇలా ఉండగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో TVK పార్టీ తరఫున విరుగంబాక్కం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శబరినాథన్ పోటీ చేసి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థి ప్రభాకర రాజాపై 27 వేల పై చిలుకు ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు శబరినాథన్. కాగా శబరినాథన్ తండ్రి రాజేంద్రన్... దాదాపు 30 సంవత్సరాలుగా సీఎం విజయ్ దగ్గర పనిచేస్తున్నారు. నమ్మకమైన డ్రైవర్ గా, వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరిస్తున్నారు.

Next Story