- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర విద్యా విధానం (SEP)ను విడుదల చేయనున్న తమిళనాడు సీఎం
by Malleboina Mahesh |
జాతీయ విద్యా విధానానికి పోటీగా తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర విద్యా విధానం ను తీసుకొచ్చింది. దీనిని మరికాసేపట్లో సీఎం స్టాలిన్ విడుదల చేయనున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (CM MK Stalin) ఈ రోజు రాష్ట్ర విద్యా విధానం (SEP)ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు చెన్నైలోని కోట్టూర్‌పురంలో ఉన్న అన్నా సెంటెనరీ లైబ్రరీ ఆడిటోరియంలో ఏర్పాట్లు చేశారు. ఈ రాష్ట్ర విద్యా విధానంను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రూపొందించింది. దీనికి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. మురుగేసన్ అధ్యక్షత వహించారు. ఈ కమిటీ 2024 లో నివేదికను సమర్పించింది. అప్పటి నుండి ఈ విధానం విడుదల, అమలు కోసం వేచి ఉంది. అయితే 2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తమిళనాడు ప్రభుత్వం ఈ రాష్ట్ర విద్యా విధానంను తీసుకొచ్చింది. మరికొద్ది సేపట్లో సీఎం స్టాలిన్ ఈ రాష్ట్ర విద్యా విధానానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
Next Story






