దేశ రాజకీయాల్లో సంచలనం.. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీనామా

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-04 13:25:27  IST  )

తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకున్నది.

దేశ రాజకీయాల్లో సంచలనం.. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకున్నది. తమిళనాడు బీజేపీ(Tamil Nadu BJP) రాష్ట్ర అధ్యక్ష పదవికి అన్నామలై(Annamalai) రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను శుక్రవారం జాతీయ అధ్యక్షుడు నడ్డా(JP Nadda)కు పంపించారు. త్వరలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్న నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్లు అన్నామలై లేఖలో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జిల్లా అధ్యక్షుల నియామకాలను బీజేపీ పూర్తి చేసింది. ఇక రాష్ట్రాలకు కొత్త బాస్‌లతో పాటు జాతీయ అధ్యక్షుడి నియామకం పెండింగ్‌లో ఉంది. ఉగాదిలోపే ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని అందరూ భావించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా అన్నామలై రాజీనామాతో అతి త్వరలో రాష్ట్రాల అధ్యక్షులతో పాటు జాతీయ అధ్యక్షుడి ప్రకటన కూడా ఉండబోతోందని తెలుస్తోంది.

మరోవైపు తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు అనే దానిపై అప్పుడే ఆ రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. మహిళ కావడం, ఎన్నికల్లో మహిళా ఓట్లు కీలకం కావడంతో పార్టీ ఈమెను అధ్యక్షురాలిగా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమిళిసైతో పాటు ఎల్ మురుగన్, మురుగానందం పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

Next Story