Breaking: విజయ్ టీవీకే పార్టీకి విజిల్ సింబల్ కేటాయింపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-22 09:55:07  IST  )

తమిళనటుడు విజయ్ టీవీకే పార్టీకి ఈసీ విజిల్ సింబల్ కేటాయించింది....

Breaking: విజయ్ టీవీకే పార్టీకి విజిల్ సింబల్ కేటాయింపు
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనటుడు విజయ్(Vijay) టీవీకే పార్టీ(TVK Party)కి ఈసీ విజిల్ సింబల్ కేటాయించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా సత్తా చాటతామని తెలిపారు. నటుడు విజయ్ తమిళనాడులో కొత్త పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రాజకీయ శక్తిగా మారిన ఆయనకు ఈసీ వద్ద గుర్తింపు లభించింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ పార్టీకి సింబల్ కేటాయించాలన్న అభ్యర్థనను పరిశీలించిన ఈసీ తాజాగా విజిల్ సింబల్ కేటాయించింది.

పోటీకి సై


కాగా వచ్చే ఎన్నికల్లో టీవీకే పార్టీ పోటీ చేసేందుకు ఇప్పటికే పార్టీ సంస్థాగతంగా సిద్ధమైంది. ఆ పార్టీ అధినేత విజయ్ రాష్ట్రంలో పలుచోట్ల భారీ బహిరంగ సభలను సైతం నిర్వహించారు. అయితే కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో విషాదం చోటు చేసుకుంది. 41 మంది చనిపోగా 100 మందికిపైగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి హీరో విజయ్‌ను సీబీఐ అధికారులు రెండు విడతలుగా విచారించారు. ఈ తరుణంలో విజయ్ కు ఈసీ గుడ్ న్యూస్ తెలిపింది. ఆయన స్థాపించిన టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయించింది. దీంతో ఆ పార్టీ విజిల్ గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేయనుంది.

Next Story