- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Taliban: అఫ్గాన్ తాలిబన్ సర్కారుతో పురుషులకు తప్పని కష్టాలు
అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ సర్కారు హయాంలో మహిళలకే కాదు.. పురుషులకు కూడా కష్టాలు తప్పట్లేదు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది.

దిశ, నేషనల్ బ్యూరో: అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ సర్కారు హయాంలో మహిళలకే కాదు.. పురుషులకు కూడా కష్టాలు తప్పట్లేదు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. తాలిబన్ల ‘సదాచార ప్రచార, దురాచార నిరోధ మంత్రిత్వ శాఖ’ ధాటికి కులవృత్తులవారు నష్టపోతున్నారు. ప్రజారవాణాలో మెలగాల్సిన తీరు; హెయిర్ కటింగ్, సంగీతం, పండుగ రోజుల్లో సందడిపై గత ఆగస్టులో ఈ శాఖ నియమావళి విడుదల చేసింది. అంతేకాకుండా, మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ముఖం చూపకూడదనీ, బిగ్గరగా మాట్లాడకూడదని తాలిబన్ సర్కారు ఆదేశించింది.
నైతిక పోలీసులు
కాగా.. న్యూ హెయిర్ స్టెయిల్ చేసుంకుంటున్న వ్యక్తులు, ఆ కటింగ్ చేసిన బార్బర్లను అఫ్గాన్ నైతిక పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఈ నియమాలను పర్యవేక్షించడానికి ప్రభుత్వం 3,300 మంది ఇన్‌స్పెక్టర్లను నియమించింది. ఆరు నెలల్లో అరెస్టయినవారిలో సగం మంది తమ గడ్డాన్ని నిర్దిష్ట రీతిలో కత్తిరించుకోని, నిర్దేశిత రీతిలో హెయిల్ స్టయిల్ చేయించుకోని వ్యక్తులు, వారి బార్బర్లే ఉండకటం గమనార్హం. రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా నమాజ్ చేయని వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలను విద్య, ఉద్యోగాల్లో పాలుపంచుకోనివ్వకపోవడం వల్ల అఫ్గానిస్థాన్ ఏడాదికి 140 కోట్ల డాలర్లు నష్టపోతుందని ఇప్పటికే ఐక్యరాజ్యసమితి తెలిపింది.






