- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Taliban: భారత్ మాకు ముఖ్యమైన మిత్రదేశం.. దుబాయ్ సమావేశం తర్వాత తాలిబన్ల ప్రకటన
by B.Srinivas |
భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ , ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన తాలిబన్ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీలు దుబాయ్‌లో భేటీ అయిన విషయం తెలిసిందే.

X
దిశ, నేషనల్ బ్యూరో: భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram misry) , ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన తాలిబన్ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ (Amir Khan Muttaqi) లు దుబాయ్‌లో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశం అనంతరం ముత్తాఖీ కీలక ప్రకటన చేశారు. భారత్ తమకు కీలకమైన మిత్ర దేశమని, ఇండియాతో రాజకీయ, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయాలని ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ పాలన కోరుకుంటోందని తెలిపారు. ఈ విధానం తాలిబాన్ విదేశాంగ విధానానికి అనుగుణంగా ఉందని వెల్లడించారు. ఇరు పక్షాల మధ్య జరిగిన సమావేశం దౌత్య సంబంధాల స్థాయిని పెంచేందుకు ఎంతో దోహదపడ్డాయని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఏ దేశానికీ ముప్పు కలిగించబోదని హామీ ఇచ్చారు. 2021లో ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి భారత ప్రభుత్వం, తాలిబాన్‌ల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి చర్చ ఇవే కావడం గమనార్హం.
Next Story






