- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Taliban: అంతర్జాతీయ దినోత్సవం వేళ మహిళల హక్కులపై తాలిబన్ల పోస్టు
మహిళల హక్కులను కాపాడుతున్నట్లు అఫ్గానిస్థాన్ లోని తాలిబన్ ప్రభుత్వం పేర్కొంది. ఇస్లామిక్ చట్టాల ప్రకారం మహిళల హక్కులను కాపాడున్నామని.. అయితే, అవి పాశ్చాత్య సమాజానికి భిన్నంగా ఉంటాయని చెప్పుకొచ్చింది.

దిశ, నేషనల్ బ్యూరో: మహిళల హక్కులను కాపాడుతున్నట్లు అఫ్గానిస్థాన్ లోని తాలిబన్ ప్రభుత్వం పేర్కొంది. ఇస్లామిక్ చట్టాల ప్రకారం మహిళల హక్కులను కాపాడున్నామని.. అయితే, అవి పాశ్చాత్య సమాజానికి భిన్నంగా ఉంటాయని చెప్పుకొచ్చింది. ఈ మేరకు తాలిబన్ సర్కారు ఓ ప్రకటన విడుదల చేసింది. అఫ్గాన్ ప్రభుత్వం మహిళల విషయాల్లో అనుసరిస్తున్న విధానాలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. కాగా.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాలిబన్ల ప్రధాన ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ నుంచి ప్రకటన రావడం గమనార్హం. ముజాహిద్ సోషల్ మీడియాలో ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. "ఇస్లామిక్ చట్టం, అఫ్గాన్ సమాజం సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా మహిళలకు ప్రాథమిక హక్కులు ఉంటాయి. అయితే, ఇస్లామిక్ సంస్కృతికి వెస్ట్రన్ కల్చర్ కి మధ్య స్పష్టమైన తేడాలు ఉన్నాయి. కాగా.. పాశ్చాత్య సమాజాలు ఆవిషయాన్ని గుర్తించాలి" అని ముజాహిద్ అన్నారు.
తాలిబన్ ప్రభుత్వం
2016లో అఫ్గానిస్థాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడింది. అప్పట్నుంచి అక్కడి మహిళలపై ఆంక్షలు విధిస్తున్నారు. బాలికల ఉన్నత విద్యను నిషేధించారు. మహిళలను పనిచేసేందుకు కూడా అనుమతించట్లేదు. మరోవైపు, ఈ నిర్బంధ చర్యలను తిప్పికొట్టాలని ఐక్యరాజ్యసమితి తాలిబాన్లపై ఒత్తిడి తెస్తూనే ఉంది. మహిళల హక్కులను గుర్తించడానికి తాలిబాన్లు నిరాకరించడంతో అంతర్జాతీయ సమాజం నుండి ఒంటరిగా మారింది. అంతేకాకుండా, తాలిబన్లు పశ్చిమ దేశాల నుంచి చట్టబద్ధమైన ప్రభుత్వంగా అధికారిక గుర్తింపు పొందలేదు.






