- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Takaichi: జపాన్ తదుపరి ప్రధానిగా సనై తకైచీ.. తొలి మహిళా పీఎంగా రికార్డ్ !
అధికార ఎల్‌డీపీలో నెలకొన్న అంతర్గత విభేదాల కారణంగా జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ)లో నెలకొన్న అంతర్గత విభేదాల కారణంగా జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా (Shigeru ishiba) తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్‌డీపీ కొత్త అధ్యక్షురాలిగా సనై తకైచీ (Sanae Takaichi) ఎన్నికయ్యారు. పార్టీ నాయకత్వం కోసం శనివారం జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధాని జునిచిరో కొయిజుమి కుమారుడు షింజిరో కొయిజుమిపై తకైచీ గెలుపొందారు. ఆ దేశంలో మెజారిటీ పార్టీ అధినేత పీఎం అవుతారు కాబట్టి తకైచీ ప్రధాని కావడానికి మార్గం సుగమం అయింది. దీంతో ఆమె త్వరలోనే జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనుండగా దేశ తొలి మహిళా పీఎంగా రికార్డు సాధించనునున్నారు.
ఎల్‌డీపీ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన అనంతరం తకైచీ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రసంగించారు. జపాన్ పాలక పార్టీకి నూతన యుగం ప్రారంభమైందని తెలిపారు.జాతీయ రక్షణ, ఆర్థిక భద్రతపై దృష్టి సారిస్తానని చెప్పారు. కాగా, 1961లో నారాలో జన్మించిన తకైచీ కోబ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1993 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. 1996లో ఎల్‌డీపీలో చేరారు. ఆర్థిక భద్రత, అంతర్గత వ్యవహారాల మంత్రి సహా అనేక కీలక ప్రభుత్వ పదవులను నిర్వహించారు.






