- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాజ్ మహల్ వద్ద యాంటీ-డ్రోన్ సిస్టం.. పాక్ దాడుల తర్వాత డెసిషన్!
by Phanindra |
తాజ్ మహల్ వద్ద యాంటీ-డ్రోన్ సిస్టం ఏర్పాటు చేయనున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాకిస్తాన్ దాడుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

X
దిశ, నేషనల్ బ్యూరో: యునెస్కో గుర్తింపు పొందిన తాజ్ మహల్ వద్ద భద్రతను పెంచాలని నిర్ణయించారు. ఈ కాంప్లెక్స్‌లో యాంటీ-డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం తాజ్ మహల్ వద్ద సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), ఉత్తర ప్రదేశ్ పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత భారత దేశంలో పలుచోట్ల డ్రోన్లు, మిసైల్స్‌తో దాడులు చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే తాజ్ మహల్ వద్ద యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని, దీనికి 7-8 కిలోమీటర్ల రేంజ్ ఉంటుందని అధికారులు చెప్పారు. తాజ్ మహల్ ప్రధాన డోమ్‌కు 200 మీటర్ల పరిసరాలను రక్షించే బాధ్యత ఈ వ్యవస్థ నిర్వర్తిస్తుందని తెలిపారు.
Next Story






