మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఇంజక్షన్లతో దాడి.. 145 మందికి అస్వస్థత..

by Sujitha Rachapalli |

ఫ్రాన్స్‌లో జరిగిన ఫేట్ డి లా మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఇంజక్షన్ల దాడి కలకలం రేపింది. యువతులే టార్గెట్‌గా ఈ దాడులు జరగ్గా.. 145 మంది అస్వస్థతకు గురయ్యారు. తలతిరగడం, తిమ్మిరి, వేడి ఆవిర్ల వంటి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు.

మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఇంజక్షన్లతో దాడి.. 145 మందికి అస్వస్థత..
X

దిశ, వెబ్‌డెస్క్: ఫ్రాన్స్‌లో జరిగిన ఫేట్ డి లా మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఇంజక్షన్ల దాడి కలకలం రేపింది. యువతులే టార్గెట్‌గా ఈ దాడులు జరగ్గా.. 145 మంది అస్వస్థతకు గురయ్యారు. తలతిరగడం, తిమ్మిరి, వేడి ఆవిర్ల వంటి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. ఇంజక్షన్లలో రోహిప్నోల్, జీహెచ్‌బీ వంటి డేట్-రేప్ డ్రగ్స్ ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై టాక్సికాలజీ పరీక్షలు జరుగుతున్నాయి. కాగా ఫెస్టివల్‌కు ముందు సోషల్ మీడియాలో ముఖ్యంగా అబ్రేజ్ సోయిర్ వంటి ఫెమినిస్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు.. మహిళలపై దాడులకు పిలుపునిచ్చే పోస్టుల గురించి హెచ్చరించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి 14 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇక ఈ ఇన్సిడెంట్ 2022లో ఫ్రాన్స్‌లో, 2021లో యూకేలో నమోదైన సిరంజి-స్పైకింగ్ ఘటనలను పోలి ఉంది. ఈ దాడిని లైంగిక వేధింపులు, సోషల్ మీడియా ద్వారా ప్రేరేపితమైన భయంకరమైన ధోరణితో సంబంధం కలిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు అధికారులు. పబ్లిక్ ఈవెంట్‌లలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కాగా ఈ మ్యూజిక్ ఫెస్టివల్‌లో 370 మందికి పైగా అరెస్టు అయ్యారు. ఇందులో ఇంజక్షన్ల దాడులు, గొడవలు, కత్తితో ఎటాక్స్ కూడా ఉన్నాయి.

Next Story