60 ఏళ్ల తర్వాత యూఎన్‌లో మాట్లాడిన సిరియా అధ్యక్షుడు.. ఇజ్రాయెల్‌పై ఆగ్రహం

by Phanindra |

60 ఏళ్ల తర్వాత యూఎన్‌లో సిరియా అధ్యక్షుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.

60 ఏళ్ల తర్వాత యూఎన్‌లో మాట్లాడిన సిరియా అధ్యక్షుడు.. ఇజ్రాయెల్‌పై ఆగ్రహం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ)లో సుమారు 60 ఏళ్ల తర్వాత తొలిసారి సిరియా అధ్యక్షుడు ప్రసంగించారు. ప్రపంచ దేశాల్లో తన స్థానాన్ని సిరియా తిరిగి పొందుతోందని అహ్మద్ అల్ షారా చెప్పారు. ఇదే సమయంలో తమ దేశంలో అసద్ ప్రభుత్వం కూలిన తర్వాత ఇజ్రాయెల్ నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతర్జాతీయ కమ్యూనిటీ నుంచి తమకు మద్దతు లభిస్తున్నా.. ఇజ్రాయెల్ విధానం మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉందన్నారు.

1974 డిసెంగేజ్‌మెంట్ ఒప్పందం నాటి సరిహద్దులకు ఇజ్రాయెల్ దళాలు వెనుతిరగాలని ఆయన కోరారు. ఈ రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, ఇజ్రాయెల్ ఆసక్తులను కాపాడేలా ఒప్పందం చేసుకుంటామని ఇటీవలే ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది. ఈ క్రమంలో సిరియా అధ్యక్షుడి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Next Story