- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Syria: సిరియాలో తీవ్రమవుతున్న అంతర్యుద్ధం.. మరో నగరాన్ని స్వాధీనం చేసుకున్న రెబల్స్
దిశ, నేషనల్ బ్యూరో: సిరియా (Syria)లో అంతర్యుద్ధం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. హయత్ తహ్రీర్ అల్-షామ్ (HTS) నేతృత్వంలోని తిరుగుబాటుదారులు మరో నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. జోర్డాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న కీలకమైన దారా (Daraa) నగరాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. దారా ప్రావిన్స్‌లోని చాలా ప్రాంతాలపై సాయుధులు పట్టు సాధించినట్టు తెలిపింది. ఈ ప్రాంతంలోని 90 శాతం ప్రాంతాలను రెబల్స్ స్వాధీనం చేసుకోగా అసద్ సైన్యం అక్కడి నుంచి వెనక్కి వెళ్లినట్టు తెలుస్తోంది. దారాలో విజయం అనంతరం స్థానికులతో కలిసి తిరుగుబాటుదారులు సంబరాలు చేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో వారం రోజుల వ్యవధిలోనే రెబల్స్ మూడు నగరాలను హస్తగతం చేసుకోవడం గమనార్హం. అంతకుముందు ఉత్తర నగరమైన అలెప్పో(Aleppo)ను, హమా(Hamaa) నగరాలను స్వాధీనం చేసుకున్నారు.
ఏ క్షణంలోనైనా డమాస్కస్‌పై పట్టు సాధించే చాన్స్ !
దారా నగరాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత తిరుగుబాటు దారులు హోమ్స్ (Homes) నగరం వైపుగా కదలినట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో సిరియన్ సైన్యంతో బీకరంగా పోరాడుతోంది. హోమ్స్ సిటీపై నియంత్రణ సాధించిన వెంటనే, డమాస్కస్ చేరుకోవడానికి రెబల్స్‌కు మార్గం క్లియర్ అవుతుంది. దీంతో ఎప్పుడైనా రాజధానిని కైవసం చేసుకోవచ్చని తెలుస్తోంది. దేశంలో హింసాకాండ తీవ్రతరం అవుతుందన్న భయాందోళనల మధ్య ప్రభుత్వ నియంత్రణలో ఉన్న లటాకియా, టార్టస్‌లలో భద్రత కోసం వేలాది కుటుంబాలు తమ ఇళ్ల నుంచి పారిపోయినట్టు పలు కథనాలు వెల్లడించాయి. మరోవైపు బషర్ అల్-అస్సాద్ మద్దతుదారులు సైతం ఇతర ప్రాంతాలకు వెళ్లినట్టు తెలుస్తోంది.
జోర్డాన్ సరిహద్దు మూసివేత
సిరాయాలో వేగంగా మారుతున్న పరిస్థితులపై చర్చించడానికి ఇరాన్, ఇరాక్, సిరియా విదేశాంగ మంత్రులు బాగ్దాద్‌లో సమావేశమయ్యారు. ప్రస్తుత పరిణామాలపై చర్చించారు. సిరియాలో పరిస్థితిని తమ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని ఇరాక్ విదేశాంగ మంత్రి ఫవాద్ హుస్సేన్ తెలిపారు. ప్రస్తుత పరిణామాలు ఈ ప్రాంత భద్రతకు తీవ్ర ముప్పు తెస్తాయని సిరియా విదేశాంగ మంత్రి బస్సామ్ సబ్బాగ్ తెలిపారు. మరోవైపు సిరియాలో క్షీణిస్తున్న పరిస్థితుల దృష్ట్యా జాబర్ సరిహద్దును మూసివేస్తున్నట్లు జోర్డాన్ (Jordan) అంతర్గత మంత్రి మజెన్ ఫరాయా (Mazen faraya) ప్రకటించారు. లెబనాన్ సరిహద్దులోనూ పలు ఆంక్షలు విధించారు.
2011లోనూ బీభత్సం
2011లో సిరియాలో అంతర్యుద్ధం మొదలైంది. అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు ప్రారంభించారు. అయితే వీటిని అణచివేయడానికి బషర్ ప్రయత్నించడంతో అంతర్యుద్ధం ప్రారంభమైంది. తిరుగుబాటుదారులు, అసద్ సైన్యానికి మధ్య జరిగిన ఈ పోరులో సుమారు 5లక్షల మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా అనేక మంది నిరాశ్రయులయ్యారు. గత కొంత కాలంగా సిరియాలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి ఘర్షణలు ప్రారంభమవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.