భారత విద్యార్థులకు తీపికబురు.. స్టూడెంట్స్ వీసాలకు యూఎస్ గ్రీన్ సిగ్నల్

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-19 03:18:03  IST  )

అమెరికా (America) జాతీయ భద్రతకు భంగం కలిగిస్తున్నారంటూ అంతర్జాతీయ విద్యార్థులపై ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump) ప్రభుత్వం ఇటీవలి కాలంలో అనేక ఆరోపణలు చేస్తూ వస్తోంది.

భారత విద్యార్థులకు తీపికబురు.. స్టూడెంట్స్ వీసాలకు యూఎస్ గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా (America) జాతీయ భద్రతకు భంగం కలిగిస్తున్నారంటూ అంతర్జాతీయ విద్యార్థులపై ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump) ప్రభుత్వం ఇటీవలి కాలంలో అనేక ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఈ అంశంపై ఆ దేశంలోని ప్రముఖ యూనివర్సిటీలు, అధ్యక్షుడిగా ప్రత్యక్ష యుద్ధమే నడుస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా స్టూడెంట్స్ (VISA) వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారి ఇంటర్వ్యూ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. కానీ, అనూహ్యంగా స్టూడెంట్స్ వీసాలపై ఇవాళ యూఎస్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. చిన్న గ్యాప్ తర్వాత స్టూడెంట్ వీసాల మంజూరు ప్రక్రియను పున:ప్రారంభిస్తున్నట్లుగా పేర్కొంది. అదేవిధంగా దరఖాస్తుదారులు స్క్రీనింగ్‌ సమయంలో తప్పనిసరిగా తమ సోషల్‌ మీడియా (Social Media) అకౌంట్ల వివరాలు సమర్పించాలని కండీషన్ పెట్టింది. అదేవిధంగా యూఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలతో పాటు, వ్యక్తిగత డేటాను కూడా చెక్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. తాజా పరిణామంతో స్టూడెంట్స్ వీసాల ప్రక్రియ మరోసారి ఊపందుకోనుంది.

Next Story