- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mappls : గూగుల్ మ్యాప్స్‌కు పోటీగా స్వదేశీ యాప్.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ వైరల్
గూగుల్ మ్యాప్స్‌కు పోటీగా మరో మేడిన్ ఇండియా యాప్‌ను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రమోట్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాకు చెందిన గూగుల్ మ్యాప్స్ (Google Maps) నావిగేషన్ యాప్ గురించి అందరికీ తెలిసిందే. దేశంలో ప్రతి స్మార్ట్ ఫోన్లలో దాదాపు ఈ యాప్ ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది. నావిగేసన్ యాప్‌లు ఎన్ని వచ్చినా కూడా ఇంకా గూగుల్ మ్యాప్స్ హవా కొనసాగుతోంది. అయితే, గూగుల్ కు పోటీగా మరో మేడిన్ ఇండియా యాప్‌ను (Union Minister Ashwini Vaishnav) కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రమోట్ చేశారు. గూగుల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయమైన 'Mappls' by MapmyIndia చాలా బాగా పని చేస్తుందని ఆయన తాజాగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇందులో 13 మంచి ఫీచర్లు ఉన్నాయని, తప్పకుండా వాడాలని దేశ ప్రజలను కోరారు. ఆ యాప్ రోడ్లపై ఓవర్ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లను ఈజీగా గుర్తించవచ్చని, అపార్ట్ మెంట్‌లలో ఉండే షాప్‌లను కూడా చూపిస్తుందని తన కారులో ‘మ్యాపుల్స్’ నావిగేషన్ యాప్ వాడుతున్న వీడియో పోస్ట్ చేసి వివరించారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. గూగుల్ మ్యాప్స్‌కు పోటీగా స్వదేశీ యాప్ రావడంపై నెటిజన్‌లు హర్షం వ్యక్తం చేశారు.
కాగా, తెలియని ప్రదేశాలకు వెళ్లినప్పుడు గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ యాప్‌ను ప్రతి ఒక్కరు వాడుతారు. అయితే, తాజాగా స్వదేశీ యాప్ రూపొందించడంతో గూగుల్ పై ఆధారపడాల్సిన అవసరం లేదని చర్చానీయాంశంగా మారింది. ‘మ్యాపుల్స్’ నావిగేషన్ యాప్ ('Mappls' by MapmyIndia) చాలా రకాల ఫిచర్లను కలిగి ఉంది. అందులో ముఖ్యంగా జంక్షన్ వ్యూ, లైవ్ ట్రాఫిక్ సిగ్నల్ టైమర్లు, భద్రతా పరమైన హెచ్చరికలు, ప్రాంతీయ భాష లక్షణాలతో రూపొందించారు. ఇందులో ప్రధానంగా 3 డీ జంక్షన్ వ్యూ కనిపిస్తుంది. ప్రత్యేకంగా భారతీయ రోడ్లు, జంక్షన్లపై ఎక్కువ అవగాహన ఉంది. భారత్‌లో డ్రైవింగ్‌ను మరింత భద్రంగా, సులభంగా మార్చేందుకు ఈ యాప్ రూపొందించినట్లు MapmyIndia మంత్రి ట్వీట్‌కు కామెంట్ చేసింది. Mappls యాప్ ఇప్పటి వరకు 35 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్స్ చేసుకున్నారని అన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ చేసినందుకు సంస్థ కృతజ్ఞతలు తెలిపింది. స్వదేశీ సాంకేతిక విప్లవంలో భాగమవ్వాలని ప్రజలకు సంస్థ పిలుపు నిచ్చింది. ట్వీట్ ఇదే..






