- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Indo-Bangladesh Border: అసోంలో అనుమానాస్పద డ్రోన్ స్వాధీనం
అసోంలోని శ్రీభూమి జిల్లాలో అనుమానాస్పద డ్రోన్ ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో దాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: అసోంలోని శ్రీభూమి జిల్లాలో అనుమానాస్పద డ్రోన్ ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో దాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కుషియారా నదికి కేవలం 50 మీటర్ల దూరంలోని చోరాకురి ప్రాంతంలో డ్రోన్ లభ్యమైంది. ఒక ఇంటి పైభాగంలో నల్ల రంగు డ్రోన్ ని చూడగానే స్థానికులు అధికారులకు సమాచారమందించారు. ఆ డ్రోన్ చైనాలో తయారయ్యిందని పోలీసులు గుర్తించారు. శ్రీభూమి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పార్థ ప్రోతిమ్ దాస్ మాట్లాడుతూ.. డ్రోన్ సరిహద్దు దాటి వచ్చిందని అనుమానిస్తున్నామన్నారు."ఒక ఇంటి పైభాగంలో నల్ల రంగు డ్రోన్ దొరికిందని చోరాకురి ప్రాంతం నుండి మాకు సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మేడ్ ఇన్ చైనా అని డ్రోన్ పైన ఉంది. అది సరిహద్దు దాటి వచ్చిందని మేము అనుమానిస్తున్నాం. ఆ డ్రోన్‌ను విశ్లేషిస్తున్నాం" అని పార్థ ప్రోతిమ్ దాస్ అన్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు, ఏప్రిల్ 26న అసోంలోకి అక్రమంగా రాష్ట్రంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఆరుగురు బంగ్లాదేశీయుల్ని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. శ్రీభూమి పోలీసులు అక్రమ చొరబాటుని అడ్డుకున్నట్లు తెలిపారు.






