- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NIA ఆఫీస్ సమీపంలో అనుమానాస్పద పరికరం లభ్యం.. కలకలం రేపుతున్న చైనా గుర్తులు
పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత జమ్మూకాశ్మీర్‌లో ఇంకా ఉద్రిక్తతలే కొనసాగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత జమ్మూకాశ్మీర్‌లో ఇంకా ఉద్రిక్తతలే కొనసాగుతున్నాయి. తాజాగా, ఓ ఘటన భద్రతా బలగాలకు ఉలిక్కిపడేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. జమ్మూ ప్రాంతంలోని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రధాన కార్యాలయం సమీపంలో చైనా గుర్తులు ఉన్న రైఫిల్ స్కోప్ లభ్యమైంది. దీంతో ఒక్కసారిగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆదివారం ఉదయం సిద్రా ప్రాంతంలోని అస్రారాబాద్‌లో చెత్త డంప్ చేసే ప్రాంతంలో ఆడుకుంటున్న ఓ ఆరేళ్ల బాలుడికి రైఫిల్ స్కోప్ దొరికింది. దానిని అతడు బొమ్మగా భావించి ఆడుకుంటున్నాడు. అది చూసిన భద్రతా బలగాలు బాలుడి తల్లిదండ్రులను ప్రశ్నించగా.. తమ కొడుక్కి చెత్తలో దొరికిందని చెప్పారు.
అయితే, ఆ రైఫిల్ స్కోప్ అసాల్ట్ స్నైపర్ రైఫిల్స్‌కు అమర్చే టెలిస్కోప్ అటాచ్‌మెంట్‌గా గుర్తించారు. ఇది NIA హెడ్‌క్వార్టర్స్, జమ్మూ-కాశ్మీర్ పోలీస్ సెక్యూరిటీ హెడ్‌క్వార్టర్స్ మధ్య ప్రాంతంలో లభ్యమైంది. అదేవిధంగా సమీపంలోనే CRPF, SSB బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్ కూడా ఉన్నాయి. ఈ సంఘటనతో సంబంధించి సంబా జిల్లాలో 24 ఏళ్ల యువకుడు తన్వీర్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి మొబైల్‌లో పాకిస్తాన్ నంబర్ ఉన్నట్లుగా తెలిసింది. తన్వీర్ దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్ నివాసి కానీ ప్రస్తుతం సంబాలో నివసిస్తున్నాడు. ప్రస్తుతం జమ్మూ గ్రామీణ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) బృందాలు ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నాయి. కాగా, గత నాలుగు రోజులుగా అంతర్జాతీయ సరిహద్దు నుంచి LoC వరకు BSF సిబ్బంది అన్ని ట్రూప్స్‌తో కలిసి ఉమ్మడి సెర్చ్ ఆపరేషన్లు చేపడుతున్నాయి.






