విద్యార్థులపై AK-47తో కాల్పులు.. పోలీస్ కానిస్టేబుల్ సస్పెన్షన్

by Gantepaka Srikanth |

విద్యార్థుల నిరసన ప్రదర్శన సందర్భంగా AK-47 తుపాకీతో కాల్పులకు తెగబడిన పోలీసు కానిస్టేబులపై బిహార్ పోలీసు శాఖ తీవ్ర చర్యలు తీసుకుంది.

విద్యార్థులపై AK-47తో కాల్పులు.. పోలీస్ కానిస్టేబుల్ సస్పెన్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థుల నిరసన ప్రదర్శన సందర్భంగా AK-47 తుపాకీతో కాల్పులకు తెగబడిన పోలీసు కానిస్టేబులపై బిహార్ పోలీసు శాఖ తీవ్ర చర్యలు తీసుకుంది. విద్యార్థులపైకి ఆయుధాన్ని గురిపెట్టి కాల్పులు జరుపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. దేశవ్యాప్తంగా సాగుతున్న విద్యార్థుల ఉద్యమంలో భాగంగా బిహార్‌లో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆందోళనకారులను అదుపు చేసే క్రమంలో విధుల్లో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్.. తన వద్ద ఉన్న AK-47 రైఫిల్‌తో విద్యార్థుల వైపు కాల్పులు జరిపాడు. ఈ దృశ్యాలను అక్కడున్న కొందరు ఫోన్‌లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తీవ్ర దుమారం రేగింది.

విపక్షాల ఆగ్రహం..

ఈ ఘటనపై బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ తీవ్రంగా స్పందించారు. కానిస్టేబుల్ కాల్పులు జరుపుతున్న వీడియోను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ.. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడటాన్ని తీవ్రంగా ఖండించారు. అటు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధులు, విద్యార్థి సంఘాలు కూడా పోలీసుల వైఖరిపై మండిపడ్డాయి. ప్రభుత్వ శాంతియుత చర్చల హామీలకు భిన్నంగా నిరసనకారులపై విచక్షణారహితంగా పోలీసులు దౌర్జన్యానికి దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా సమగ్ర విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు, బాధ్యుడైన కానిస్టేబుల్‌పై వేటు వేశారు.

Next Story