సంచలనం.. మొన్న బళ్లారి ఎస్పీగా విధులు, నిన్న సస్పెన్షన్, నేడు ఆత్మహత్యాయత్నం

by Malleboina Mahesh |

కర్ణాటకలోని బళ్లారిలో గాలి జనార్దన్ రెడ్డి, స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గీయుల మధ్య జరిగిన వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

సంచలనం.. మొన్న బళ్లారి ఎస్పీగా విధులు, నిన్న సస్పెన్షన్, నేడు ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటకలోని బళ్లారిలో గాలి జనార్దన్ రెడ్డి, స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గీయుల మధ్య జరిగిన వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ఆ రోజే బళ్లారి ఎస్పీగా విధులు చేపట్టిన పవన్ నజ్జార్ (Pawan Nejjur)పై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. పరిస్థితిని అదుపు చేయడంలో వైఫల్యం చెందారని, ఉన్నతాధికారులకు సరైన సమాచారం చేరవేయలేదనే ఆరోపణలతో కర్ణాటక ప్రభుత్వం ఆయనను వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న కారణంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. అయితే ఎప్పీగా విధుల్లో చేరిన మొదటి రోజే.. సస్పెన్షన్ వేటు పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎస్పీ పవన్ నజ్జూర్ ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. తుమకూరు జిల్లా శిరా తాలూకాలోని తన ఫామ్ హౌస్‌లో నిద్రమాత్రలు మింగి ఆయన ఆత్మహత్యాయత్నానికి యత్నించినట్లు తెలుస్తోంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడి కోలుకుంటుండగా.. ఒక సమర్ధుడైన ఐపీఎస్ అధికారి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పూర్తి వివరాలను సేకరించేందుకు ప్రభుత్వం అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా ఈ సమాచారం అందుకున్న వెంటనే మాజీ ఎస్పీ శోభారాణి ఆస్పత్రికి చేరుకొని డాక్టర్లతో మాట్లాడారు.

Next Story