- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సస్పెండ్
సస్పెండ్ అయిన వారిలో గోవింద్ సింగ్, రాంకేశ్ మీనా, అమిన్ కాగ్జి, జాకిర్ హుస్సేన్, హకీమ్ అలీ, సంజయ్ కుమార్‌లు ఉన్నారు.

- రాత్రంతా అసెంబ్లీలో ఉండాలని నిర్ణయం
- ఇందిరా గాంధీని ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యలపై నిరసన
దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్ అసెంబ్లీలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. బీజేపీ మినిస్టర్ అవినాశ్ గెహ్లోత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తూ వెల్‌లోకి దూసుకొని వచ్చారు. స్పీకర్ చెబుతున్నా వినకుండా అక్కడే ఆందోళన చేస్తుండటంతో సభను మూడు సార్లు వాయిదా వేశారు. అయినా వారు వెల్ నుంచి కదలక పోవడంతో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా రాత్రంతా అసెంబ్లీలోనే ఉండాలని ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లకు కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. వారికి కావల్సిన ఆహారం, పరుపులను ఇప్పటికే అసెంబ్లీకి తరలించారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా హాస్టల్స్‌పై అడిగిన ప్రశ్నకు మంత్రి అవినాశ్ గెహ్లోత్ సమాధానమిస్తూ.. 2023-24 బడ్జెట్లో కూడా ఎప్పటిలాగే మీరు ఆ పథకానికి మీ నానమ్మ పేరు పెట్టుకున్నారంటూ మాట్లాడారు. అయితే మినిస్టర్ స్టేట్మెంట్‌పై ప్రతిపక్ష నాయకుడు తిలక్ రామ్ జాలీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక వేళ ఆయన మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఉద్దేశించి ఆ మాట అనుంటే వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వెల్‌లోకి వెళ్లారు. రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్, ఎమ్మెల్యే గోవింద్ సింగ్ అసెంబ్లీ సెక్రటరీ టేబుల్ వద్దకు వెళ్లి మినిస్టర్‌తో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకోవడంతో పలు మార్లు సభను వాయిదా వేశారు. అయితే ఎంతకూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెనక్కు తగ్గకపోవడంతో స్పీకర్ వారిని బడ్జెట్ సెషన్స్ ముగిసే వరకు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో గోవింద్ సింగ్, రాంకేశ్ మీనా, అమిన్ కాగ్జి, జాకిర్ హుస్సేన్, హకీమ్ అలీ, సంజయ్ కుమార్‌లు ఉన్నారు.






