- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Noida: అనుమానంతో భార్యను సుత్తితో తలపై దారుణంగా చంపిన భర్త
కలకాలం తోడుండాల్సిన భార్యనే ఓ భర్త కడతేర్చాడు. వివాహేతర సంబంధం ఉందనే కారణంతో తలపై సుత్తితో కొట్టి చంపాడు. ఈ ఘటన నోయిడాలోని సెక్టార్ 15 ప్రాంతంలో జరిగింది.

దిశ, నేషనల్ బ్యూరో: కలకాలం తోడుండాల్సిన భార్యనే ఓ భర్త కడతేర్చాడు. వివాహేతర సంబంధం ఉందనే కారణంతో తలపై సుత్తితో కొట్టి చంపాడు. ఈ ఘటన నోయిడాలోని సెక్టార్ 15 ప్రాంతంలో జరిగింది. నూరుల్లా హైదర్(55), అస్మా ఖాన్ (42) భార్యాభర్తలు. అస్మా ఖాన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. నోయిడాలోని సెక్టార్ 15 ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అస్మా ఖాన్.. మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేసింది. భర్త హైదర్ కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేశాడు. అయితే ప్రస్తుతం అతను నిరుద్యోగిగా ఉన్నాడు. వీళ్లిద్దరికీ 2005లో వివాహం జరిగింది. కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే చాలా రోజుల నుంచి అస్మా ఖాన్‌పై హైదర్ అనుమానిస్తున్నాడు. భార్యకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తున్నాడు. దీనిపై చాలా రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. కాగా.. ఈ విషయంలోనే శనివారం కూడా మరోసారి ఘర్షణ జరిగింది. దీంతో సుత్తి తీసుకుని అస్మా ఖాన్ తలపై కొట్టగా అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. కుమారుడు 112 నెంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు.
కేసు నమోదు
వెంటనే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానంతోనే భార్యను చంపినట్లు నురుల్లా హైదర్ ని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాంబదన్ సింగ్ తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలిలో ఆధారాలు సేకరించినట్లు వెల్లడించారు. మరోవైపు, భార్యాభర్తల మధ్య చాలా రోజుల నుంచి గొడవలు ఉన్నట్లుగా బాధితురాలి సోదరుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.






