Sambhal Mosque: సంభాల్ మసీదులో సర్వే కొనసాగుతోంది- అలహాబాద్ హైకోర్టు తీర్పు

by Shamantha N |

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌ మసీదులో సర్వే కొనసాగుతుందని అలహాబాద్ హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది.

Sambhal Mosque: సంభాల్ మసీదులో సర్వే కొనసాగుతోంది- అలహాబాద్ హైకోర్టు తీర్పు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌ మసీదులో సర్వే కొనసాగుతుందని అలహాబాద్ హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. సర్వే చేపట్టవద్దని దాఖలైన పిటిషన్‌ను తిరస్కరిస్తూ జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్‌తో కూడిన సింగిల్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. సంభాల్ సివిల్ కోర్టు సర్వే ఆర్డర్‌ను సవాలు చేస్తూ జామా మసీదు నిర్వహణ కమిటీ పిటిషన్ దాఖలు చేసింది. మసీదు ప్రాంగణంలో సర్వే నిర్వహించాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI), అడ్వకేట్ కమిషనర్‌తో కలిసి 2024 నవంబర్ 19న దిగువ కోర్టు తీర్పు వెలువరించింది. ఆ తీర్పుని సవాల్ చేస్తూ హైకోర్టుని ఆశ్రయించింది. అయితే, మసీదు నిర్వహణ కమిటీకి అక్కడ చుక్కెదురైంది.

గతేడాది నవంబరులో సర్వే

సివిల్ కోర్టు ఆదేశాన్ని అనుసరించి గతేడాది నవంబర్ 19న ప్రాథమిక సర్వే ప్రారంభమైంది. అది నవంబర్ 24 వరకు. కొనసాగింది. అయితే, రెండవ రౌండ్ సర్వే సమయంలో పరిస్థితి తీవ్రమైంది. ఫలితంగా హింస చెలరేగింది. ఆ హింసలో నలుగురు మరణించారు. ఆ తర్వాత సివిల్ కోర్టు నవంబర్ 29 నాటికి సర్వే నివేదికను సమర్పించాలని ఆదేశించింది. దీనికి ప్రతిస్పందనగా, మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై జనవరి 8న విచారణ జరిగింది. సివిల్ కోర్టు సర్వే ఆదేశంపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. దిగువ కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న అసలు దావాపై చర్యలను కూడా నిలిపివేసింది. ఇప్పుడు, సర్వే కొనసాగుతోందని స్పష్టం చేసింది.

Next Story