Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో భారీగా మావోయిస్టుల లొంగుబాటు

by Muthe.Rajitha |

మావోయిస్టుల(Maoists)కు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది.

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో భారీగా మావోయిస్టుల లొంగుబాటు
X

దిశ, వెబ్ డెస్క్ : మావోయిస్టుల(Maoists)కు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని నారాయణపూర్ జిల్లాలో నేడు 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 8 మంది మహిళల నక్సలైట్లు ఉన్నారు. వీరంతా నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ఎదుట లొంగిపోయారు. వీరిపై మొత్తం రూ.37 లక్షల రివార్డు ఉంది. వీరు కుతుల, నెలనార్, ఇంద్రావతి ఏరియా కమిటీలలో క్రియాశీలకంగా ఉన్నారు. లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు రూ.25,000 ఆర్థిక సహాయం, ఇళ్ళు, ఉపాధి వంటి పునరావాస సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. 2024 నుంచి బస్తర్‌లో 792 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.

Next Story