ప్రత్యేక పోక్సో కోర్టుల సంఖ్య పెంచండి.. సుప్రీం కీలక ఆదేశాలు

by Ajay Maddhiboyina |

ప్ర‌త్యేక పోక్సో కోర్టుల సంఖ్య‌ను పెంచాల‌ని కేంద్రానికి సుప్రీం ధ‌ర్మాస‌నం కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌త్యేక కోర్టులు లేక‌పోవ‌డం వ‌ల్ల కేసుల విచార‌ణ ఆలస్యం అవుతుంద‌ని న్యాయ‌మూర్తులు బేలా

ప్రత్యేక పోక్సో కోర్టుల సంఖ్య పెంచండి.. సుప్రీం కీలక ఆదేశాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్ర‌త్యేక పోక్సో కోర్టుల సంఖ్య‌ను పెంచాల‌ని కేంద్రానికి సుప్రీం ధ‌ర్మాస‌నం కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌త్యేక కోర్టులు లేక‌పోవ‌డం వ‌ల్ల కేసుల విచార‌ణ ఆలస్యం అవుతుంద‌ని న్యాయ‌మూర్తులు బేలా ఎం త్రివేది మ‌రియు పీబీ వ‌ర‌లేల‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది. కేంద్రం మ‌రియు రాష్ట్ర ప్ర‌భుత్వాలు పోక్సో కేసుల ద‌ర్యాప్తుతో సంబంధం ఉన్న అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేయడానికి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది. అంతే కాకుండా పోక్సో కేసుల‌ను అత్యంత ప్రాధాన్య‌తా ప్రాతిప‌దిక‌న విచారించ‌డానికి ప్ర‌త్యేక కోర్టులు అత్య‌వ‌స‌రం అని భావించింది. కేంద్రం నిధుల‌తో పోక్సో కేసుల కోసం ప్ర‌త్యేక కోర్టులు ఏర్పాటు చేయాల‌నే ఆదేశాల‌ను మెజారిటీ రాష్ట్రాలు పాటిస్తున్న‌ప్ప‌టికీ బీహార్, త‌మిళ‌నాడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, ప‌శ్చిమ‌బెంగాల్, మ‌హారాష్ట్ర‌, ఒరిస్సా మరికొన్ని రాష్ట్రాల్లో కేసులు పెండింగ్ లో ఉంటున్నాయి. ఈ నేప‌థ్యంలోనే వెంట‌నే పోక్సో కోర్టులు నిర్మించాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Next Story