Supreme Court on Insurance: ప్రమాద బీమా పాలసీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

by Ramesh Naini |

తాజాగా ప్రమాద బీమా పాలసీ పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

Supreme Court on Insurance: ప్రమాద బీమా పాలసీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అతి వేగం, నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణిస్తే (insurance policy) ఇన్సూరెన్స్ కంపెనీ బీమా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రమాద బీమా పాలసీ పై సుప్రీం కోర్టు (Supreme Court) సంచలన తీర్పు (verdict) వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. 2014వ సంవత్సరం జూన్ 18న కర్ణాటక రాష్ట్రంలో రవీష్ అనే వ్యక్తి, అతి వేగంగా, నిర్లక్ష్యంతో కారు నడిపి మరణించాడు. అనంతరం బాధితుడి కుటుంబ సభ్యులు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రూ.80 లక్షలు బీమా పరిహారం కోరారు.

పోలీసులు దాఖలు చేసిన చార్జ్‌షీటులో రవీష్ అతివేగం, నిర్లక్ష్యం ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. అయితే బాధిత కుటుంబం మాత్రం టైరు పేలడం వల్లే ప్రమాదం జరిగిందని కోర్టులో వాదించారు. కానీ నిర్లక్ష్యంగా వాహనం నడిపినట్టు ఆధారాలు ఉండడంతో వారి వాదనలను కోర్టు తిరస్కరించింది.ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా, నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణిస్తే, వారి కుటుంబ సభ్యులు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోలేరంటూ కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే, మృతుడు బీమా పాలసీ పరిధిలోకి వస్తాడని నిరూపించాల్సిన బాధ్యత కూడా కుటుంబ సభ్యుల మీదే ఉంటుందని కోర్టు తెలిపింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ బాధితుడి కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసును జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం విచారించింది. మృతుడు తన తప్పిదం వల్లే ప్రమాదానికి గురై మృతి చెందినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, నిర్లక్ష్యంగా వాహనం నడిపితే దానికి ఇన్సూరెన్స్ కంపెనీ బాధ్యత వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

Next Story