- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారికి భారత్‌లో ఆశ్రయం ఇవ్వలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
భారత్(India)లో తమకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ శ్రీలంక(Sri Lanka) శరణార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు(Supreme Court) కొట్టివేసింది.

దిశ, వెబ్‌డెస్క్: భారత్(India)లో తమకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ శ్రీలంక(Sri Lanka) శరణార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు(Supreme Court) కొట్టివేసింది. శరణార్థులకు భారత్‌లో స్థానం లేదని.. తక్షణమే దేశాన్ని వీడి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇప్పటికే దేశంలో జనాభా 140 కోట్లకు పెరిగిందని.. ఈ జనాభాతోనే తాము సతమతమవుతున్నామని పేర్కొంది. విదేశీయులకు ఆశ్రయం ఇవ్వడానికి ఇదేమీ ధర్మసత్రం కాదు.. వేరే ఏ దేశానికైనా వెళ్లిపోండి అని సూచనలు చేసింది. ఆర్టికల్ 19 కింద స్థిరపడే హక్కు భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.
ఇదిలా ఉండగా.. మూడేళ్ల క్రితం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. కరోనా వ్యాప్తి తరువాత ఆ దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. నిత్యావసరాల ధరలు సైతం వందల రెట్లు పెరిగిపోవడంతో ఆ దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆ సమయంలో శ్రీలంక శరణార్థులు మన దేశంలోకి వచ్చారు. తీరప్రాంతాల గుండా భారత్‌లోకి ఎంటర్ అయి.. ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని జీవిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం భారత్ - పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చిన శరణార్థులందరినీ కేంద్రం వెనక్కి పంపిస్తోంది. ఈ క్రమంలోనే తమకు ఇక్కడే ఆశ్రయం ఇచ్చేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని శరణార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఇక్కడ ఉండటానికి వీళ్లేదని తేల్చిచెప్పింది.






