- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు.. OTTలు, సోషల్ మీడియా హ్యాండిళ్లకు నోటీసులు
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ (OTT Platforms), సోషల్ మీడియా (Social Media)లో అందుబాటులో ఉన్న లైంగిక, అసభ్యకరమైన కంటెంట్‌ను నిషేధించాలని కోరుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ (OTT Platforms), సోషల్ మీడియా (Social Media)లో అందుబాటులో ఉన్న లైంగిక, అసభ్యకరమైన కంటెంట్‌ను నిషేధించాలని కోరుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్ (BR Gavai), అగస్టిన్ జార్జ్ మాసిహ్ (Augustine George Masih)లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ఆన్‌లైన్ (Online)లో అశ్లీల, లైంగిక, అసభ్యకర డేటాను నియంత్రించేందుకు జాతీయ కంటెంట్ నియంత్రణ అథారిటీ (National Content Regulatory Authority)ని ఏర్పాటు చేసేలా వెంటనే కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్లు ధర్మాసానికి విజ్ఞప్తి చేశారు. కఠిన నియమాలు లేకపోవడం వల్లే ఆన్‌లైన్‌లో జుగుప్సాకరమైన కంటెంట్ పుట్టుకొస్తుందని అన్నారు.
ఇక కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫాంలు ‘పిల్లల అశ్లీలత’కు సంబంధించి సమానమైన కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నారని వాదించారు. ఈ పరిణామంతో దేశంలోని యువత, పిల్లలు చెడిపోతున్నారని పేర్కొన్నారు. ఎప్పటికైనా అశ్లీల కంటెంట్ సామాజిక విలువలకు భంగం వాటిల్లేలా చేస్తుందని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదలను విన్న ధర్మాసనం కేంద్రంతో పాటు పలు ఓటీటీలు, సోషల్ మీడియా హ్యాండిళ్లకు నోటీసులు జారీ చేసింది. అందులో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఉల్లు, ఆల్ట్‌టీ ఓటీటీలు, X, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియ ప్లాట్‌ఫామ్స్ కూడా ఉన్నాయి.






