Supreme Court: ఢిల్లీలో కాలుష్యం.. వారికి రూ.10 వేల పరిహారం

by Prasad Jukanti |

ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

Supreme Court: ఢిల్లీలో కాలుష్యం.. వారికి రూ.10 వేల పరిహారం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ ఎయిర్ పొలూష్యన్‍పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో పొలూష్యన్‍ కారణం అని పేర్కొంటూ ఢిల్లీలో ఉన్న 9 టోల్ గేట్లను మరో చోటుకు మార్చాలని ఆదేశించింది. ఢిల్లీలో వాయుకాలుష్య సంక్షోభంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక ఢిల్లీలో వాయుకాలుష్యానికి ట్రాఫిక్ జామ్ లు కూడా ఓ కారణం అని పేర్కొన్న సుప్రీంకోర్టు.. ఈ మేరకు ఎన్‍హెచ్ఏఐ‍కి సుప్రీంకోర్టు ఇవాళ నోటీసులు ఇచ్చింది. ఢిల్లీలో వాయు కాలుష్య సమస్య ప్రతి సంవత్సరం పునరావృతం అవుతూనే ఉందని దీనికి పరిష్కారంగా దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించి దశల వారీగా అమలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. వాయు కాలుష్య సమస్యను ఎదుర్కొనేందుకు తీసుకున్న దీర్ఘకాలిక చర్యలను CAQM (కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్) మళ్లీ సమీక్షించి, అమలులోకి తీసుకురావాలని ఆదేశించింది. ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో ఇప్పటివరకు అధికారులు తీసుకున్న చర్యలు పూర్తిగా విఫలమయ్యాయని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. పాఠశాలల మూసివేత విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

ఢిల్లీలో కాలుష్యం తగ్గించేందుకు భవన నిర్మాణాలపై ఆంక్షలు విధించడంతో ఆ కార్మికులు ఉపాధి లేక ఖాళీగా ఉన్నారని అందువల్ల ఆ భవన నిర్మాణ కార్మికుల ఖాతాల్లో నగదు వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. భవన నిర్మాణ కార్మికులకు ఇతర పనులు చూపించాలంది. దీంతో భవన నిర్మాణ కార్మికుల ఖాతాల్లో నగదు వేస్తాయమని ఢిల్లీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఢిల్లీలో మొత్తం 2.50 లక్షల మంది కార్మికులు ఉన్నారని 7 వేల మంది కార్మికుల ఖాతాలే వెరిఫై అయినట్లు ఢిల్లీ సర్కార్ తెలిపింది.

Next Story