- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్వేష ప్రసంగాలను నియంత్రించాలి.. కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు
విద్వేష ప్రసంగాలను నియంత్రించాలని సుప్రీంకోర్టు చెప్పింది. కేంద్ర, రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవలి కాలంలో దేశంలో పెరిగిపోతున్న విద్వేష వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. విద్వేష ప్రసంగాలు, వ్యాఖ్యలను కట్టడి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అదే సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛకు ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలని చెప్పింది. హిందువులపై విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసిన వజాహత్ ఖాన్ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
భావప్రకటనా స్వేచ్ఛ పేరు చెప్పి ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలను ప్రచారం చేయడం బాధాకరమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రభుత్వం తమ మాటలను నియంత్రించడం ఎవరికీ ఇష్టం ఉండదు కాబట్టి.. భావ ప్రకటనా స్వేచ్ఛ విలువను ప్రజలకు తెలియజేయాలని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ప్రజలకు ఎందుకు అర్థం కావడం లేదని ధర్మాసనం ప్రశ్నించింది.
‘ఇటువంటి విద్వేష ప్రసంగాలను ఇష్టపడకుండా, ఇతరులతో పంచుకోకుండా ప్రజలు నియంత్రణ పాటించాలి. కంటెంట్ విషయంలో కూడా కొన్ని నిబంధనలు ఉండాలి’ అని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ విషయంలో భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలుగకుండా విద్వేష ప్రసంగాలను నిలువరించే మార్గాలను సూచించాలని కేంద్రంతోపాటు వజాహత్ ఖాన్ తరఫు న్యాయవాదిని కూడా కోరింది.






