Supreme Court: ఆ క్రిస్టియన్ ఆర్మీ అధికారి తొలగింపు సబబే: సుప్రీంకోర్టు

by Prasad Jukanti |   (  Updated:2025-11-25 08:16:24  IST  )

మతపరమైన పరేడ్‌లో పాల్గొనని ఆర్మీ అధికారిని తొలగించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.

Supreme Court: ఆ  క్రిస్టియన్ ఆర్మీ అధికారి తొలగింపు సబబే: సుప్రీంకోర్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మతపరమైన పరేడ్‍లో పాల్గొనేందుకు నిరాకరించిన క్రైస్తవ ఆర్మీ ఆఫీసర్‍ను (Christian Army officer) విధుల్లో నుంచి తొలగించడాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) సమర్థించింది. ఇది సైనిక అధికారిగా అతను చేసిన అత్యంత దారుణమైన క్రమశిక్షణా రాహిత్యం అని దీని ద్వారా అతను ఎలాంటి సందేశం పంపుతున్నాడని ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant) సీరియస్ కామెంట్స్ చేశారు. ఈ అంశంలో ఆర్మీ నిర్ణయాన్ని సమర్ధిస్తూ గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఒక వ్యవస్థగా ఆర్మీ లౌకికమైందని, దాని క్రమశిక్షణ విషయంలో రాజీ పడలేమని తేల్చి చెప్పింది. సైన్యం ఒక లౌకికమైన సంస్థ అని అయితే క్రమశిక్షణలో రాజీపడలేమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్య బాగ్చిలతో (Justice Joymala Bagchi) కూడిన ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది.

అసలేం జరిగింది?:

శామ్యూల్ కమలేసన్ అనే క్రైస్తవ అధికారి తాను విధులు నిర్వర్తించే రెజిమెంట్‍లో గురుద్వారా, మందిరం ఉన్నాయి. విధుల్లో భాగంగా జవాన్లు ప్రతి వారం ఆ గుడిలోనికి వెళ్లి పూజలు చేసి మతపర పరేడ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ట్రూప్ లీడర్ గా శామ్యూలే తన కింద పని చేసే జవాన్లను గుడికి తీసుకుకెళ్లాల్సి ఉటుంది. అయితే తాను క్రిస్టియన్ అయినందున అలాంటి పూజలు చేయలేనని, తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. అందుకు ఉన్నతాధికారులు నిరాకరించారు. ఈ క్రమంలో 2021 మార్చి 3న ఆయనను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తనను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ శామ్యూల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ఆర్మీ తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్ధించింది. మతం కంటే యూనిఫామే ముఖ్యం అని, ఆదేశాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ శామ్యూల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ పై ఇవాళ జేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర నారాయణన్ వాదించారు. తన క్లయింట్‌ను ఒకే ఒక ఉల్లంఘనకు మాత్రమే తొలగించారని, అతను తాను నియమించిన ఆలయంలోని గర్భగుడిలోకి ప్రవేశించడానికి మాత్రమే నిరాకరించాడని ఒక వేళ సర్వ ధర్మ స్థలాలు ఉంటే తన క్లయింట్ పాల్గొనేవారని వాదించాడు. దీంతో క్రమశిక్షణ కలిగిన దళంలో ఇలాంటి దుందుడుకు ప్రవర్తన అనుమతించబడుతుందా? అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. దానికి పిటిషనర్ తరఫున న్యాయవాది స్పందిస్తూ తాను నియమితుడైన ప్రదేశంలో సర్వ ధర్మ స్థలం లేదని ఆ ప్రదేశంలో ఒక గురుద్వారా, ఒక ఆలయం మాత్రమే ఉన్నాయి. పిటిషనర్ ఆలయం వెలుపల నిలబడి ఉన్నాడని చెప్పారు. తాను ఏకధర్మ విశ్వాసాన్ని అనుసరించే వ్యక్తి కాబట్టి గర్భగుడిలోకి ప్రవేశించడం లేదని అది తన క్రైస్తవ విశ్వాసానికి విరుద్ధమని ఆయన వాదించారు. ఆయన దుందుడుకు మనిషి కాదు. మిగతా అన్ని అంశాలలోనూ ఆయన క్రమశిక్షణ కలిగిన వ్యక్తి కోర్టుకు తెలిపారు. సాయుధ దళాలలో చేరినంత మాత్రాన, రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద హామీ ఇవ్వబడిన మతం పట్ల తన ప్రాథమిక హక్కును కోల్పోరని వాదించారు. దీంతో తాను ఎలాంటి సందేశం పంపుతున్నాడు? ఆయన అత్యుత్తమ అధికారి కావచ్చు కానీ భారత సైన్యానికి సరిపోరని తన తోటి (సిక్కు) సైనికుల విశ్వాసాన్ని గౌరవించనందుకు అతన్ని బహిష్కరించాలనే సాయుధ దళాల నిర్ణయాన్ని సమర్థించారు.

Next Story