ఇది భారీ కాదు.. అతిభారీ దోపిడీ.. స్వయంగా సుప్రీంకోర్టే ఆందోళన

by Gantepaka Srikanth |

దేశవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.

ఇది భారీ కాదు.. అతిభారీ దోపిడీ.. స్వయంగా సుప్రీంకోర్టే ఆందోళన
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ మోసాల(Digital Frauds)పై సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్రంగా స్పందించింది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం.. సోమవారం విచారణ జరిపింది. ఈ విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. డిజిటల్ ఆర్థిక మోసాల ద్వారా సైబర్‌ నేరగాళ్లు రూ.54 వేల కోట్లకుపైగా కొల్లగొట్టారని, ఇది ముమ్మాటికీ దోపిడేనని సుప్రీంకోర్టు పేర్కొంది. డిజిటల్ మోసాలపై ఆర్‌బీఐ, బ్యాంకులు సకాలంలో చర్యలు తీసుకోవాలని సూచించింది. డిజిటల్‌ ఆర్థిక మోసాల్లో బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం కూడా లేకపోలేదని స్పష్టం చేసింది. డిజిటల్ మోసాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆయా ప్రభుత్వ సంస్థలు నాలుగు వారాల్లోగా ఒక ముసాయిదా ఒప్పందాన్ని రూపొందించాలని ఆదేశించింది. విదేశాల్లో ఉంటూ మోసాలకు పాల్పడుతున్న నేరస్థులను పట్టుకునేందుకు.. ఇంటర్ పోల్ సాయం తీసుకోవాలని ఇటీవలి విచారణలో సూచించిన విషయం తెలిసిందే.

Next Story