Supreme court: ఉగ్రదాడి పిరికిపంద చర్య.. తీవ్రంగా ఖండించిన సుప్రీంకోర్టు

by B.Srinivas |

జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది. ఈ దాడిని పిరికి పింద చర్యగా అభివర్ణించింది.

Supreme court: ఉగ్రదాడి పిరికిపంద చర్య.. తీవ్రంగా ఖండించిన సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌ (Jammu Kashmir)లో జరిగిన ఉగ్రదాడిని సుప్రీంకోర్టు (Supreme court) తీవ్రంగా ఖండించింది. ఈ దాడిని పిరికి పింద చర్యగా అభివర్ణించింది. ఇదొక పైశాచిక చర్య అని దేశ మసస్సాక్షిని ఈ ఘటన ఎంతో కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. బాధిత కుటుంబ సభ్యులకు తమ సంఘీభావాన్ని తెలిపింది. దాడికి సంతాపం తెలియజేస్తూ సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు, న్యాయవాదులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఉగ్రవాద చర్యను ఖండిస్తూ సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ‘బుద్ధి హీనమైన హింసాత్మక చర్య దేశంలోని ప్రతి ఒక్కరి మనస్సాక్షిని కదలించింది. ఉగ్రవాద క్రూరత్వాన్ని పూర్తిగా గుర్తు చేసింది. ఈ ఘటనలో మరణించిన వారికి అత్యున్నత న్యాయస్థానం నివాళులర్పిస్తోంది. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి’ అని తీర్మానంలో పేర్కొంది.

Next Story