- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sabarmati Ashram : గాంధీ మునిమనవడికి సుప్రీం షాక్
మహాత్మా గాంధీ మునిమనవడికి సుప్రీంకోర్ట్(Supreme Court) షాక్ ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : మహాత్మా గాంధీ మునిమనవడికి సుప్రీంకోర్ట్(Supreme Court) షాక్ ఇచ్చింది. సబర్మతి ఆశ్రమం(Sabarmati Ashram) అంశాన్ని ఎమోషనల్ సెంటిమెంట్ తో ముడిపెట్టి చూడవద్దని సూచించింది. గుజరాత్(Gujarat) లో అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమాన్ని రూ.1200 కోట్లతో రెన్నోవేషన్ చేయాలని గుజరాత్ ప్రభుత్వం భావించింది. అయితే దీనిని ఆపాలంటూ మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ(Mahathma Gandhi Great Grandson Tushar Gandhi) హైకోర్టులో పిటిషన్ వేశాడు. 2022లో ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తూ.. తుషార్ గాంధీ పిటిషన్ కొట్టివేసింది. దీనిని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
సబర్మతి ఆశ్రమాన్ని ఆధునీకరించడం వలన ఆశ్రమం టోపోగ్రఫీ మారిపోతుందని, నైతికత దెబ్బతింటుందని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం.. "మీ సెంటిమెంట్ ను ఈ అంశానికి ముడిపెట్టవద్దని సూచించింది. దేశం ముందుకు వెళ్తున్నపుడు దానితోపాటు ముందుకు సాగాలి. తాము అన్ని అంశాలను పరిశీలించాకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాము" అని పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో సబర్మతి ఆశ్రమ ఆధునీకరణకు అడ్డంకులు తొలగిపోయాయి అని గుజరాత్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది.






