- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదాపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
by Phanindra |
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదాపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. 8 వారాల్లో తమ అభిప్రాయం తెలపాలని కోరింది.

X
దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలోని వాస్తవిక పరిస్థితులను కూడా పరిగణనలోనికి తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఈ క్రమంలోనే చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం.. పహెల్గాం ఉగ్రదాడిని గుర్తుచేసింది. ఇది చాలా ముఖ్యమైన అంశమని పేర్కొంది. అదే సమయంలో జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించడంపై 8 వారాల్లోగా తమ అభిప్రాయం తెలపాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐదేండ్లుగా జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉందని, దీని వల్ల ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రాధాన్యత తగ్గిపోతుందని పిటిషనర్లు వాదించారు.
Next Story






