- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పైలట్‌ను ఎవరూ నిందించొద్దు.. ఎయిరిండియా ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్
ఎయిరిండియా ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పైలట్‌ను ఎవరూ నిందించొద్దని స్పష్టంచేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఎయిరిండియా ప్రమాదానికి ఎవరూ పైలట్‌ను నిందించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ప్రాథమిక దర్యాప్తు అనంతరం గుజరాత్‌లో కూలిన ఎయిరిండియా విమానంలోని ఇద్దరి పైలట్ల సంభాషణ బయటకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పైలట్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రమాదానికి గురైన బోయింగ్ డ్రీమ్‌లైనర్ పైలట్-ఇన్-కమాండ్ సుమీత్ తండ్రి పుష్కరాజ్ సభర్‌వాల్ కోర్టుకెక్కారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ సూరమాల్యా బాగ్చీ ధర్మాసనం.. ‘ఈ ప్రమాదం చాలా దురదృష్టకరమైన ఘటన. దీంట్లో మీ కుమారుడిని బ్లేమ్ చేస్తున్నారనే కారణంతో ఆ భారమంతా మీరు మోయాల్సిన అవసరం లేదు. దేశంలో ఎవరూ కూడా ఈ ప్రమాదానికి మీ కుమారుడు కారణమని అనుకోవడం లేదు. ప్రాథమిక రిపోర్టులో కూడా మీ కుమారుడు తప్పుచేసినట్లు ఎక్కడా లేదు. ఫ్యూయల్ స్విచ్ ఆగిపోవడంపై ఇద్దరు పైలట్లు మాట్లాడుకున్నారంతే’ అని జస్టిస్ సూర్యకాంత్ వివరించారు.
అయితే అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్.. నేరుగా పైలట్‌ను బ్లేమ్ చేస్తూ వార్తాకథనం రాసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది గుర్తుచేవారు. ‘విదేశీ మీడియా రిపోర్టులను మేం పట్టించుకోవడం లేదు. వాటిపై పరిష్కారం కావాలంటే విదేశీ కోర్టుకే వెళ్లాల్సి ఉంటుంది కదా. అది పనికిమాలిన జర్నలిజం అంతే’ అని జస్టిస్ కాంత్ అన్నారు. ఆ కథనంలో భారత ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందినట్లు పేర్కొన్నారని పిటిషనర్ తరఫ న్యాయవాది తెలిపారు. ఈ క్రమంలోనే ఏఏఐబీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు ఈ విషయంలో వివరణ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా బోయింగ్ విమానాల్లో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని, కావున దీనిపై ఇండిపెండెంట్ విచారణ చేపట్టాలని పిటిషనర్ తరఫు లాయర్ పేర్కొన్నారు. ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ఎయిరిండియా ఘటనపై దాఖలైన ఇతర పిటిషన్లను కూడా నవంబరు 10వ తేదీనే విచారణ జరుపుతామని తెలిపింది.
ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా, ఎక్కడైనా జరిగితే.. చివరకు పైలట్ వల్లనే ప్రమాదం జరిగినట్లు మూసేసేవారు. ఇలా చేయడం వల్ల అసలు తప్పు చేసిన విమానయాన సంస్థలు ఎలాంటి సమస్య లేకుండా తప్పించుకునేవి. అయితే ఈసారి అలాంటి అవకాశం ఇవ్వకుండా పైలట్‌ను బ్లేమ్ చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.






