- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supreme Court: ప్రసూతి సెలవులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
మహిళలు మాతృత్వపు లబ్ధి, సంతానం పొందే హక్కుల్లో ఇవి అత్యంత కీలకమైనవని పేర్కొంది. ఏ సంస్థ కూడా స్త్రీలకు మహి

దిశ, నేషనల్ బ్యూరో: మహిళలకు ప్రసూతి సెలవులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మెటర్నెటీ లీవ్స్ ఇవ్వడాన్ని సమర్థించింది. మహిళలు మాతృత్వపు లబ్ధి, సంతానం పొందే హక్కుల్లో ఇవి అత్యంత కీలకమైనవని పేర్కొంది. ఏ సంస్థ కూడా స్త్రీలకు ఉన్న ప్రసూతి సెలవు హక్కును హరించలేదని కోర్టు వెల్లడించింది. కాగా.. తమిళనాడుకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయినికి రెండో వివాహం తర్వాత బిడ్డకు జన్మనిచ్చేందుకు ప్రసూతి సెలవులను నిరాకరించారు. దీంతో ఆమె సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. తన మొదటి వివాహం నుంచి ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వడంతో.. ఇప్పుడు మరోసారి ప్రసూతి సెలవులకు నిరాకరించినట్లు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్ర నిబంధనల ప్రకారం తొలి ఇద్దరు పిల్లలకు మహిళలు ప్రసూతి లబ్ధిని పొందే అవకాశం ఉంది. దీనిపైనే, కోర్టు వ్యాఖ్యలు చేసింది.
రెండో పెళ్లి తర్వాతే..
కాగా.. తాను రెండో వివాహం చేసుకున్న తర్వాతే ప్రభుత్వ ఉద్యోగంలో చేరినట్లు ఆ ఉపాధ్యాయిని పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాదు.. తన రెండు కాన్పులకు ఎటువంటి ప్రసూతి సెలవులు వాడుకోలేదన్నారు. ఈ సందర్భంగా ఆమె తరఫున వాదిస్తున్న న్యాయవాది కేవీ ముత్తుకుమార్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తన పిటిషనర్ ప్రాథమిక హక్కులను హరించేలా ఉందని పేర్కొన్నారు. గతంలో ఆమె ఎలాంటి ప్రసూతి సెలవులను పొందలేదన్నారు.






