Supreme Court: కేసు విషయంలో బెయిల్ ఇచ్చే అధికారం పూర్తిగా జడ్జిదే

by Shamantha N |
Supreme Court: కేసు విషయంలో బెయిల్ ఇచ్చే అధికారం పూర్తిగా జడ్జిదే
X

దిశ, నేషనల్ బ్యూరో: లైంగిక వేధింపుల కేసుల్లో.. అల‌హాబాద్ హైకోర్టు తీర్పుల‌పై అత్యున్న‌త న్యాయ‌స్థానం(Supreme Court) అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. లైంగిక వేధింపుల కేసుల్లో బాధితురాలినే హైకోర్టు తప్పుబట్టింది. ఈ కేసులో హైకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌ను సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది. మ‌హిళ‌లపై లైంగిక దాడి జ‌రుగుతున్న కేసుల్లో.. తీర్పులు ఇస్తున్న జ‌డ్జిలు అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌రాదు అని సుప్రీంకోర్టు తెలిపింది. జస్టిస్ బీఆర్ గ‌వాయి, జ‌స్టిస్ అగ‌స్టిన్ జార్జ్ మాషిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం.. ల అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా త‌ప్పుప‌ట్టింది. కేసు విష‌యంలో బెయిల్ ఇచ్చే అధికారం పూర్తిగా జడ్జి ఆధీనంలోనే ఉంటుంద‌ని పేర్కొంది. ఆ కేసుకు చెందిన సాక్ష్యాల ఆధారంగా బెయిల్ ఇవ్వ‌వ‌చ్చు.. కానీ బాధితుల‌పై అనవ‌స‌ర‌మైన వ్యాఖ్య‌లు చేయ‌రాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. వ్యాఖ్య‌లు చేస్తున్న‌ప్పుడు న్యాయమూర్తులు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని జ‌స్టిస్ గ‌వాయి తెలిపారు.

లైంగిక వేధింపుల కేసు..

మహిళ వక్షోజాలను తాకడం, పైజామా పట్టుకుని లాగడం వంటివి లైంగిక వేధింపుల కిందకు రావని అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపైనే ఇటీవలే సుప్రీంకోర్టు (Supreme Court) సుమోటోగా విచారణ చేపట్టింది. ఆ న్యాయమూర్తి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ జడ్జి వ్యాఖ్యలు ఏమాత్రం సున్నితమైనవి కావని, అమానవీయంగా ఉన్నాయని జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌ ధర్మాసనం విచారం వ్యక్తంచేసింది. మైన‌ర్‌ను వేధించ‌డం, పైజామా విప్ప‌డం లాంటి చ‌ర్య‌లు అత్యాచారం య‌త్నం కింద‌కు రావు అని ఓ కేసులో హైకోర్టు ధ‌ర్మాస‌నం చెప్ప‌డాన్ని కూడా సుప్రీంకోర్టు త‌ప్పుప‌ట్టింది. త‌న స‌మ‌స్య‌ను తానే కొని తెచ్చుకున్న‌ట్లు మరో కేసు తీర్పు స‌మ‌యంలో రేప్ బాధితురాల‌ని అల‌హాబాద్ హైకోర్టు త‌ప్పుప‌ట్టింది. దీనిపైనే ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Next Story

Most Viewed