- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supreme court: ప్రివెంటివ్ డిటెన్షన్ క్రూరమైన చర్య.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది ఒక క్రూరమైన చర్య అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రివెంటివ్ డిటెన్షన్ (Preventive detention) అనేది ఒక క్రూరమైన చర్య అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు సరైన ఎవిడెన్స్ లేకపోవడంతో డ్రగ్స్ కేసులో నిర్భందించబడిన ఇద్దరు వ్యక్తులపై డిటెన్షన్ ఆర్డర్స్ రద్దు చేసింది. డిటెన్షన్ ఉత్వర్వులు సరైన విధంగా జారీ చేయలేదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో పొందుపర్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించాయని జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ‘నివారణ నిర్బంధం అనేది ఒక క్రూరమైన చర్య. దీని ద్వారా శిక్షా చట్టం కింద విచారణ జరిగి దోషిగా నిర్ధారించబడని వ్యక్తిని నిర్ణీత కాలం పాటు నిర్బంధించొచ్చు. తద్వారా ఆ వ్యక్తి భవిష్యత్‌లో చేసే నేర కార్యకలాపాలను తగ్గించొచ్చు’ అని పేర్కొంది. కానీ డిటెన్షన్ ఆర్డర్స్ ప్రకారం ఒక వ్యక్తిని క్రిమినల్ నేరానికి పాల్పడకుండా చాలా కాలం పాటు నిర్బంధిస్తే వారి వ్యక్తిగత స్వేచ్ఛలను హరించినట్టేనని తెలిపింది.
ఇటువంటి కేసుల్లో రాజ్యాంగం సూచించిన రక్షణలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. 1988 నాటి మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ రవాణా నిరోధక (NDPS) చట్టంలోని సెక్షన్ 3(1) కింద అష్రఫ్ హుస్సేన్ చౌదరి, ఆయన భార్య అడాలియు చావాంగ్ నిర్బంధ ఉత్తర్వులకు వ్యతిరేకంగా గౌహతి హైకోర్టు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. చట్టపరమైన నిబంధనలను వర్తింపజేయడంలో గౌహతి హైకోర్టు తప్పు చేసిందని పేర్కొంది. కాగా, ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే విచారణ లేదా శిక్ష లేకుండా ఒకరిని నిర్బంధించే చర్య. సాధారణంగా భవిష్యత్తులో జరిగే నేరాలను నివారించడానికి దీనిని ఉపయోగిస్తారు.






