- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SIRలో బీఎల్‌ఓలకు పనిభారం తగ్గించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు
భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) లో బూత్ లెవెల్ ఆఫీసర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిపై పనిభారం అధికంగా ఉందని టీవీకే పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

దిశ, వెబ్ డెస్క్: భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) లో బూత్ లెవెల్ ఆఫీసర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిపై పనిభారం అధికంగా ఉందని టీవీకే పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో పిటిషన్ ను స్వీకరించిన కోర్టు.. వారి వాదనలను విన్న తర్వాత.. ఎన్నికల విధులు నిర్వర్తించే బూత్ లెవెల్ ఆఫీసర్స్ (BLOs) ఎదుర్కొంటున్న అధిక పని ఒత్తిడిని, వ్యక్తిగత ఇబ్బందులను పరిగణలోకి తీసుకుంటూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది.
ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) లో భాగంగా పనిచేస్తున్న BLOల పని గంటలను తగ్గించేందుకు అదనపు సిబ్బందిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. తద్వారా వేలాది మంది ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులుగా ఉన్న BLOలకు పెద్ద ఊరట లభించినట్లయింది. ఈ ఆదేశాలు నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) దాఖలు చేసిన పిటిషన్‌పై వచ్చాయి. అధిక పని ఒత్తిడి కారణంగా విధులు నిర్వర్తించలేని BLOలపై ప్రజా ప్రాతినిధ్య చట్టం లోని సెక్షన్ 32 ప్రకారం ECI క్రిమినల్ చర్యలు తీసుకోవడాన్ని ఈ పిటిషన్ సవాలు చేసింది.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ముఖ్యంగా, ఈ తీర్పులో మానవీయ కోణాన్ని స్పృశిస్తూ, చట్టబద్ధమైన ఎన్నికల విధులను నిర్వహించడంలో మినహాయింపు కోరుకునే వ్యక్తులు, వారి ప్రత్యేక వ్యక్తిగత కారణాలు ఉంటే, ఆ అభ్యర్థనలను కేసుల వారీగా పరిగణించి, వారి స్థానంలో మరొక వ్యక్తిని నియమించాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను, సమర్థ అధికారాన్ని ఆదేశించింది. అవసరమైతే, పనిచేసే సిబ్బంది సంఖ్యను పెంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని (obligated) కూడా CJI స్పష్టం చేశారు.






