- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: జర్నలిస్టు అజయ్ శుక్లాపై సుప్రీం కోర్టు సీరియస్
జర్నలిస్టు, యూట్యూబర్ అజయ్ శుక్లాపై సుప్రీంకోర్టు(Supreme court) సీరియస్ అయ్యింది. ఆయనపై సుమోటో కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: జర్నలిస్టు, యూట్యూబర్ అజయ్ శుక్లాపై సుప్రీంకోర్టు(Supreme court) సీరియస్ అయ్యింది. ఆయనపై సుమోటో కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టుకు చెందిన సీనియర్ న్యాయవాదిపై శుక్లా ఇటీవలే తన యూట్యూబ్ ఛానల్‌లో వివాదాస్పద వీడియోను పోస్టు చేశారు. సీనియర్ జడ్జిని కించపరిచే విధంగా ఉన్న ఆ వీడియోను డిలీట్ చేయాలని సుప్రీం ఆదేశించింది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మాషి, జస్టిస్ ఏఎస్ చందూర్‌కర్ ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఇలాంటి కంటెంట్ మళ్లీ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయరాదు అని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఈ కేసుపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. “యూట్యూబ్‌లో శుక్లా చేసిన ఆరోపణలతో న్యాయ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంద. రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛను కల్పిస్తుంది కానీ, దానికి నిబంధనలు ఉన్నాయి. అత్యున్నత న్యాయస్థానానికి చెందిన జడ్జిని కించపరిచేలా ఆరోపణలు చేయడం సరైంది కాదు. ఇది కోర్టు ధిక్కరణే అవుతోంది.” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
సుప్రీంకోర్టు
అంతేకాకుండా, ఈ కేసులో యూట్యూబ్ ఛానల్‌ను ప్రతివాదిగా చేర్చాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ ఈ కేసులో కోర్టుకు సహాయం చేయాలని కోరింది. తాత్కాలిక ఉత్తర్వు ద్వారా వీడియో ప్రచురణను ఆపివేసి, వెంటనే వీడియోను తొలగించాలని యూట్యూబ్ ఛానల్‌ను ఆదేశించింది. సీనియర్ జడ్జిపై యూట్యూబర్ శుక్లా చేసిన ఆరోపణలు తీవ్రంగా ఉన్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. శుక్లాపై సుమోటో కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు. ఇకపోతే, శుక్లా వరప్రద మీడియాకు ఎడిటర్ గానూ ఉన్నారు. జర్నలిస్టు శుక్లా ఇటీవల రిటైర్డ్ జడ్జీ బేలా ఎం త్రివేదిపై వివాదాస్పద వీడియోను పోస్టు చేశారు. దీనిపైనే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.






