- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబానీ ‘వంతారా’పై సుప్రీంకోర్టు విచారణకు ఆదేశం
అనంత్ అంబానీకి చెందిన జంతుపునరావాస కేంద్రం వంతారాపై అరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అక్కడకు విదేశాల నుండి జంతువులను అక్రమంగా తరలిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: అనంత్ అంబానీకి చెందిన జంతుపునరావాస కేంద్రం వంతారాపై అరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అక్కడకు విదేశాల నుండి జంతువులను అక్రమంగా తరలిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వంతారాకు ఏనుగులను తీసుకురావడంతో చట్టాలను ఉల్లఘించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పలు ఎన్జీవోలు, జంతుప్రేమికులు సోషల్ మీడియాలో చేసిన ఫిర్యాదుల ఆధారంగా దాఖలైన ప్రజా ప్రయోజనాల వాజ్యాలను సుప్రీంకోర్టు నేడు విచారించింది.
మాజీ న్యాయమూర్తి చలమేశ్వర్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేస్తూ విచారణకు ఆదేశించింది. వంతారాలో వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని అప్పుడు ఆరోపణలు నిజమో కాదో స్పష్టం అవుతుందని తెలిపింది. పిటిషనర్ల ఆరోపణలు పరిగణలోకి తీసుకుని ప్రతివాదులు ఇచ్చే కౌంటర్లను లెక్కించడంతో ప్రయోజనం లేదని అభిప్రాయపడింది. అందుకోసమే విచారణ జరిపేందుకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేసింది.






