దివ్యాంగుల పై అనుచిత వ్యాఖ్యలు.. యూట్యూబర్లకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

by Malleboina Mahesh |

యూట్యూబర్ సమయ్ రైనా (Samay Raina) సహా మరో ముగ్గురు కమెడియన్లు ఇటీవల దివ్యాంగులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే.

దివ్యాంగుల పై అనుచిత వ్యాఖ్యలు.. యూట్యూబర్లకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: యూట్యూబర్ సమయ్ రైనా (Samay Raina) సహా మరో ముగ్గురు కమెడియన్లు ఇటీవల దివ్యాంగులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై అనాగరిక వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కమెడియన్లపై 'క్యూర్‌ ఎస్‌ఎంఏ ఫౌండేషన్' (Cure SMA Foundation) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారించింది. ఈ సందర్భంగా యూట్యూబర్ సమయ్ రైనా (Samay Raina) సహా మరో ముగ్గురు కమెడియన్లకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

తమ వేదికలపై నిర్వహించే షోలకు విజయగాథలు కలిగిన దివ్యాంగులను ఆహ్వానించాలని, తద్వారా దివ్యాంగులకు సకాలంలో సమర్థవంతమైన చికిత్స అందించడానికి అవసరమైన నిధులను సేకరించి, వారికి సహకారం అందించాలని కోర్టు ఆదేశించింది. "మేము ఈ అంశాన్ని తదుపరి విచారించే లోపు ఇలాంటి కొన్ని గుర్తుండిపోయే కార్యక్రమాలు జరుగుతాయని మేము ఆశిస్తున్నాము. మేము మీపై పెడుతున్నది శిక్షా భారం కాదు, సామాజిక భారం. మీరందరూ సమాజంలో మంచి స్థితిలో ఉన్న వ్యక్తులు. మీరు ప్రజాదరణ పొందితే, దానిని ఇతరులతో పంచుకోవాలి," అని సీజేఐ కాంత్ అన్నారు. కమెడియన్ల వేదికల ద్వారా సామాజిక మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో సుప్రీంకోర్టు ఈ దిశానిర్దేశం చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

Next Story